
Pushpa The Rule : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప : ది రూల్’ మూవీ కి సంబంధించి ఎప్పటి నుండో అభిమానులు అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న సంగతి తెలిసిందే.అయితే పుష్ప పార్ట్ 1 ఎవ్వరూ ఊహించని స్థాయి లో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సుకుమార్ స్టోరీ ,స్క్రీన్ ప్లే విషయం లో పుష్ప కి పది రేట్లు బెటర్ గా ఉండేలా పని చేసాడు.ఫైనల్ గా స్క్రీన్ ప్లే ఆన్ పేపర్ మీద అద్భుతంగా వచ్చిందట.ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ప్రీ టీజర్ తోనే అసలు మూవీ కాన్సెప్ట్ ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందో చెప్పేసాడు సుకుమార్.పుష్ప ని పోలీసులు అరెస్ట్ చేసి తిరుపతి పోలీస్ స్టేషన్ లో దాచి పెడతారట.కానీ ఆయన అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు.ఎక్కడికి వెళ్ళాడు, ఏమి చెయ్యబోతున్నాడు అనేది తెలియాలంటే ఏప్రిల్ 7 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.ఆరోజు సాయంత్రం నాలుగు గంటల 7 నిమసిహలకు పూర్తి టీజర్ ని విడుదల చేయబోతున్నారట.ఈ టీజర్ లో అదిరిపొయ్యే యాక్షన్ కట్స్ ని సిద్ధం చేసాడట సుకుమార్.
టీజర్ నుండే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని మరోసారి ఎలేయబోతున్నాను అని హింట్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్.ఈ టీజర్ కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్తు భారతదేశ సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రం తో అల్లు అర్జున్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ పైనే కన్ను వేసాడు.
#WhereIsPushpa ?
The search ends soon!The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/djm4ClLeHg
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
