Billionaires First Jobs: ప్రపంచంలో టాప్ టెన్ కుభేరుల గురించి తెలుసుకునేటప్పుడు మనకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. వీరంతా పుట్టుకతోనే ధనవంతులా..? లేక వారి స్వయంకృషితో ఎదిగారా..? అని. అయితే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన చాలా మంది కిందిస్థాయి నుంచి వచ్చిన వారే. చిన్న ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించి అగ్రస్థానానికి ఎదిగారు. ఇప్పటి వరకు కుభేరులైన వారి చరిత్ర కూడా అలాగే ఉంది. అంతేందుకు ప్రస్తుతం ప్రపంచ కుభేరుడు ఎలెన్ మస్క్ కూడా చిన్న ఉద్యోగంతోనే తన కెరీర్ ను ప్రారంభించారు. అయితే ప్రపంచంలో అత్యధిక ధనవంతులు మొదట్లో ఎలాంటి ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించారో తెలుసుకుందాం.

-జెఫ్ బెజోస్:
2022 ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న జెఫ్ బెజోస్ మొదటి ఉద్యోగం మెక్ డోనాల్డ్స్ లో ఫ్రై కుక్. 1980లో ఈ ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ఇలా చేసినందకు ఆయనకు గంటకు 2 డాలర్లు చెల్లించేవారు. ఈ ఉద్యోగంలో అనేక నైపుణ్యాలు నేర్చుకున్న అతను ఆ తరువాత బర్గర్ లను చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత సొంతంగా అమెజాన్ సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్2 ధనవంతుడిగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 167.6 బిలియన్ డాలర్లు.
Also Read: KCR- NTR: జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తే నష్టం ఎవరికి?
-ట్రావిస్ కలానిక్:
ఉబర్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో అయిన ట్రావిస్ కలానిక్ బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టలేదు. డోర్ టు డోర్ సేల్స్ మేన్ గా జీవితం ప్రారంభించాడు. కత్తులు అమ్ముతూ జీవితాన్ని కొనసాగించాడు. ప్రస్తుతం ఆయన నికర సంపద విలువ 2 బిలయన్ డాలర్లు.
-వారెన్ బఫెట్:
బెర్క్ షైర్ హతే సీఈవో, చైర్మన్ అయిన వారెన్ బఫెట్ ఓ వార్తా పత్రిక డెలివరీ బాయ్ గా జీవితం ప్రారంభించాడు. 1994లో ప్రతి నెలా 175 డాలర్లు సంపాదించేవాడు. ఆ తర్వాత వాల్ మార్ట్ స్థాపించి తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. 2022 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన నికర సంపద విలువ 1083.4 బిలియన్ డాలర్లు.

-ఎలెన్ మస్క్:
స్పేస్ ఎక్స్, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలెన్ మస్క్ ఇటీవల వార్తల్లో నిత్యం నానుతున్నాడు. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారంతో ఆయన సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారారు. అయితే ఎలెన్ మస్క్ దక్షిణాఫ్రికాలో కంప్యూటర్ గేమ్ లను విక్రయించేవాడు. ఇందుకు ఆయన 500 డాలర్లు వచ్చేవి. ఆ తరువాత కెనడాకు వెళ్లి ఇంజనీర్ గా మారాడు. ప్రస్తుతం టెస్లా, స్పేస్ ఎక్స్ స్థాపించి ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడిగా ఎదిగాడు. ఆయన నికర సంపద విలువ 263 బిలియన్ డాలర్లు.
-జార్జియో అర్మానీ:
ఫ్యాషన్ పరిశ్రమ యొక్క లెజెండ్..సొగసైన డిజైన్లను ప్రపంచానికి పరిచయం చేసిన జార్జియో అర్మానీ ఇటాలియన్ మిలటరీలో పనిచేసేవాడు. ఆయన 20 రోజులు సెలవులో ఉన్నప్పుడు దుస్తులు కుట్టడంపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత ప్రసిద్ధ మిలన్ లోని డిపార్ట్ మెంట్ స్టోర్ లో పనిచేయడానికి వెళ్లాడు. వ్యాపారాన్ని ప్రారంభించి ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్తగా ఎదిగారు.
-ఇవాన్ స్పీగెల్:
స్నాప్ చాట్ వ్యవస్థాపకుడు స్టాన్ పోర్డ్ లో ప్రొడక్ట్ డిజైన్ ను చదివినప్పటికీ రెడ్ బుల్ కోసం ఇవాన్ శిక్షణ పొందాడు. పబ్ లు, బార్లలో ఎనర్జీ డ్రింక్ ప్రచారం చేసి అత్యున్నత స్థానానికి ఎదిగాడు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 4 బిలియన్ డాలర్లు.
-మార్క్ జుకర్బర్గ్:
ఫేస్ బుక్ సీఈవో, చైర్మన్ అయిన మార్క్ జుకర్బర్గ్ ఏ ఉద్యోగం చేయలేదు. కానీ మైక్రోసాప్ట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న సినాప్స్ అనే సంగీత సిఫార్స్ సాప్ట్ వేర్ ను రూపొందించగలిగాడు. అయితే తనకు ఉద్యోగం అవకాశం వచ్చినా హార్వర్డ్ లో చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే ఫేస్ బుక్ రూపొందించడానికి ప్రేరణ అయ్యి నేడు ప్రపంచ విజేతగా నిలబెట్టింది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 60.4 బిలియన్ డాలర్లు.
-అలెగ్జాండర్ స్పానోస్:
అమెరికన్ బిలియనీర్ రియల్ ఎస్టేట్ డెవలపర్ స్పానోస్ శాండ్ విచ్ లు అమ్మడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. ఓ ట్రక్కును అరువుగా తీసుకొని వలస కార్మికులకు శాండ్ విచ్ లను అమ్మడం ప్రారంభించాడు. రాత్రంతా అతని భార్య శాండ్ విచ్ లు తయారు చేస్తే ఉదయం నుంచి అమ్మేవారు. ఇలా ఐదు సంవత్సరాల్లోనే లక్షాధికారి అయ్యాడు.
ఇలా ప్రపంచంలోనే టాప్ ధనవంతులుగా ఉన్న వారు ఒకప్పుడు సాదాసీదా ఉద్యోగాలు చేసిన వారే. తమ నైపుణ్యం, వ్యాపారంలో చేసిన కృషితోనే కోట్లకు పడగలెత్తారు. స్వయంకృషితో ప్రయత్నిస్తే సాధించలేనిది లేదని నిరూపించారు. ప్రపంచ కుబేరులు సైతం మనలాగా ఒకప్పుడు సామాన్యులన్న సంగతి ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read:AP Three Capitals: హైకోర్టు చెప్పినా తగ్గేదేలే.. మూడు రాజధానులకే జగన్ సై