Jagan: వచ్చే ఎన్నికల్లో జగన్ కొత్త ప్రయోగం చేస్తున్నారా? ఎమ్మెల్యే అభ్యర్థులకు స్థాన చలనం కల్పిస్తున్నారా? కొందరికి మొండి చేయి చూపిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. నా గ్రాఫ్ బాగుంది.. ఎమ్మెల్యేలు, ఎంపీల గ్రాఫ్ బాగాలేదని సీఎం జగన్ చెప్పుకుంటూ వస్తున్నాయి. పని తీరు మార్చుకోవాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. కానీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో సీఎం జగన్ లో గెలుపు భయం పట్టుకుంది. అలాగని ఉన్నపలంగా సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వకుంటే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారు. అందుకే నేతలకు స్థానచలనం కల్పించి వేరే నియోజకవర్గాల్లో బరిలో దించాలన్న నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 నియోజకవర్గాల్లో మార్పులు తధ్యమని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అటు ఇటుగా కొందరి నేతలను మార్చనున్నారు. మరికొందరికి మొండిచేయి చూపనున్నారు. ఇటువంటి వారికి వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చి పక్కన పెట్టనున్నట్టు తెలుస్తోంది.

వారికి కూడా..
ఇలా మార్పులు చేస్తారన్న జాబితాలో కొందరు మంత్రులు, కీలక ఎంపీలు ఉండడం కూడా విశేషం. హిందూపురం నుంచి ఎంపీగా గోరంట్ల మాధవ్ గెలవరన్న డిసైడ్ కు సీఎం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ను కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇటీవల ఎంపీ న్యూడ్ వీడియో వ్యవహారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికంగా గోరంట్ల మాధవ్ మసకబారారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగని ఆయనకు పక్కనపెడతామంటే కుదరదు. అందుకే సామాజికవర్గపరంగా లెక్కలు వేసుకొని పత్తికొండ నుంచి పోటీ చేయించి గెలిపించుకోవాలని సీఎం జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అల్ రెడీ పత్తికొండలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటన్నది మాత్రం వెల్లడించడం లేదు. ఆయన్ను పక్కనపెడతారన్న ప్రచారం ఉంది.
Also Read: KCR- NTR: జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తే నష్టం ఎవరికి?
అవనిగెడ్డ నుంచి అంబటి..
మంత్రి అంబటి రాంబాబుకు కూడా స్థానచలనం తప్పదని ప్రచారం నడుస్తోంది. ఆయన ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆయన పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. దీంతో ఆయన్ను ప్రత్యామ్నాయంగా అవనిగెడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. అయితే అంబటికి అసలు అవనిగెడ్డతో సంబంధాలంటూ ఏవీ లేవు. ఏ ప్రాతిపదికన అక్కడ నుంచి పోటీచేయిస్తారోనని అంబటి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడున్న సిట్టింగ్ మాటేమిటని మాత్రం బయటకు చెప్పడం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి పంపించనున్నట్టు తెలుస్తోంది. మంగళగిరిలో ఆళ్ల ఇప్పుడు ఎదురీదుతున్నారు. నారా లోకేష్ పట్టుబిగిస్తున్నారు. పైగా రాజధాని ఉద్యమం నేపథ్యంలో అంత శ్రేయస్కరమని భావించి రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి నుంచి బరిలో దింపాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అటు బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ను ఏకంగా పక్కనపెడతారన్న ప్రచారం ఉంది.

డిసెంబరు కల్లా జాబితా..
ఈ ఏడాది డిసెంబరు నాటికి ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారో స్ఫష్టత రానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 నియోజకవర్గాల్లో మార్పులు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకు సంబంధించి జాబితా రూపొందించే పనిలో సీఎం జగన్ ఉన్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితిని సర్వేలు ద్వారా తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో మార్పులు తధ్యమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వ్ నియోజకవర్గాల్లో మార్పులు చేసినా కేడర్ చెక్కుచెదరదు. పైగా కొత్త వ్యక్తిని బరిలో దించితే శ్రేణులు మరింత శ్రద్ధగా పనిచేస్తాయి. అందుకే సీఎం మార్పులకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే అల్టిమేట్ గా విభేదాలకు ఆజ్యం పోయకుండా ముందుగానే నేతలకు తాయిలాలు, ముందస్తు హామీలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Also Read:AP Three Capitals: హైకోర్టు చెప్పినా తగ్గేదేలే.. మూడు రాజధానులకే జగన్ సై
[…] […]
[…] […]
[…] […]