Madiga Vishwarupa Mahasabha : ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే స్వయంగా ‘మాదిగల విశ్వరూప సభకు వస్తున్నా’ దాన్ని మీడియా పట్టించుకోవడం లేదు. మాదిగల సభకు ప్రధాని వస్తున్న ఈ విశేషమైన ప్రాధాన్యమున్న సభపై మీడియా చానెల్స్ విరివిగా వివిధ కథనాలను వేయాల్సి ఉంది. దీని మీద స్టోరీలు రాయాల్సిన అవసరం ఉంది. కానీ ఏమీ లేదు. అది నాన్ ఈవెంట్ లా తెలుగు మీడియా పరిగణించింది. ఇది దాదాపుగా దక్షిణాది అన్ని రాష్ట్రాల నుంచి జనాలు, నేతలు వస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ దళిత నేతలు వస్తున్నారు. మోడీ వచ్చే ‘మాదిగల సభ’పై సీరియస్ గా చర్చించిన దాఖలాలు లేవు. ఇది మీడియా వ్యవహరిస్తున్న దారుణమనే చెప్పొచ్చు.
తెలంగాణ, ఆంధ్రాలో ఎస్సీ కులాలు 57 ఉన్నాయి. రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమంగా అందుతాయా? అంటే దానిపై సమీక్షకే రావాలి. సమీక్షించి ఎవరైనా వర్గాలు ఉండి అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో అయితే 101 కులాలున్నాయి. ఇందులో కొన్ని లాభపడ్డాయి. కొన్నింటికి దారుణంగా ఉంది. దీని గురించి మీడియా ఎందుకు చర్చించదు.
సభ జరిగే తెలంగాణలో చూస్తే.. జనాభా పరంగా చూస్తే ఎస్సీల్లో మాదిగలు అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ విద్య, ఉద్యోగాల్లో మాదిగలకు అస్సలు ప్రాధాన్యత దగ్గడం లేదు. మాలలే దక్కుతోంది. మాదిగలు దీని వల్ల నష్టపోతున్నారు. కర్ణాటకలోని 101 కులాల్లో నష్టపోయింది మాదిగలతోపాటు మాలలు.. బంజారాలు, లంబాడాలు అక్కడ లాభపడ్డారు.
అతి పెద్ద మాదిగ విశ్వరూప మహాసభని పట్టించుకోని మీడియా తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.