Agneepath agitation సికింద్రాబాద్ లో రైల్వేస్టేషన్ దగ్ధం వెనుకాల ఖచ్చితమైన కుట్ర ఉందని తేలింది. రాజకీయ పార్టీలు దీనికి ప్రోత్సాహాన్ని అందించాయని అందులో మరణించిన వారికి అంత్యక్రియలను చేయబట్టి అందరికీ అర్థమైపోయింది. దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే.. ప్రజల ప్రాణాల కంటే రాజకీయం ముఖ్యమా? అన్నది ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన అంశంగా మారింది.

40మంది ప్రజలు ఉన్న బోగీని వారుండగానే తగులబెట్టడం దారుణమని చెప్పాలి. ఇందులో అందరూ విద్యార్థులే కాదని.. ఓ 100 మంది ఆందోళనకారులు వచ్చి విద్యార్థులను పక్కకు తప్పించి ఇదంతా చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనివెనుక కొందరు రాజకీయ పార్టీలున్నాయని తేటతెల్లమైంది.
విద్యార్థులందరినీ నిరసన పేరుతో రైల్వే స్టేషన్ రప్పించి.. అనంతరం కొందరు వచ్చి ఈ మెరుపు దాడులు చేశారంటే పక్కా కుట్రతోనే జరిగిందని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక డీజిల్ ట్యాంక్ తగులబెట్టబోయరట.. అక్కడ కాల్పులు జరిగాయి. ఆ డీజిల్ ట్యాంక్ కనుక తగులబడి ఉంటే రైల్వే స్టేషన్ చుట్టుపక్కల మొత్తం పేలిపోయేది. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంలు.. రైల్వే ఇంజిన్ లు.. చుట్టుపక్కల ప్రజలు, భవనాలు మొత్తం సర్వనాశనం అయ్యేవి.
డీజిల్ ట్యాంక్ కనుక అంటుకుంటే కొన్ని వందల మంది ప్రజలు చనిపోయేవారు. తగులబెట్టాలనుకునే వాడి ఇంటెన్షన్ అదే సందర్భంలో దీనివెనుక ఎవరున్నారన్నది తేలాలి. దేశం ఏమైపోయినా.. ప్రజలు చనిపోయినా సరే ఓట్ల రాజకీయం కోసం.. వ్యతిరేకత సృష్టించడం.. ప్రజలందరి ప్రాణాలు తీయడం కోసం తెగించినటువంటి వ్యవహారం ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం అని చెప్పొచ్చు.