Homeక్రీడలుSania Mirza: ఎవరూ ఊహించని పాత్రలోకి సానియా మీర్జా

Sania Mirza: ఎవరూ ఊహించని పాత్రలోకి సానియా మీర్జా

Sania Mirza
Sania Mirza

Sania Mirza: మొన్న మధ్య సౌత్ ఆఫ్రికాలో అండర్-19 ఉమెన్స్ టి20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా కూడా అక్కడికి వెళ్ళాడు.. మ్యాచ్ చూసేందుకేమో అని అందరూ అనుకున్నారు.. కానీ మ్యాచ్ కు ముందు ఒకరోజు వారికి మెంటార్ గా వ్యవహరించాడు.. ఒత్తిడిని ఎలా అధిగమించాలో నేర్పించాడు. సీన్ కట్ చేస్తే ఇండియా టీం ఇంగ్లాండ్ పై గెలిచింది. తొలిసారి ఐసీసీ కప్ గెలుచుకుంది. సరిగా ఈ విషయాన్ని గుర్తించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టోర్నీలో సరికొత్త అంకానికి తెర లేపింది. ఈసారి ఏకంగా క్రికెట్ కు సంబంధం లేని ఓ టెన్నిస్ మాజీ స్టార్ ను తన మెంటార్ గా నియమించుకుంది.

టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత సానియా మీర్జా ఏం చేస్తుంది అని అందరూ అనుకున్నారు.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సానియా మీర్జా కొత్త కెరియర్ ప్రారంభించేందుకు రెడీ అయింది. కాకపోతే తన టెన్నిస్ నుంచి క్రికెట్ లోకి ప్రవేశించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ మెంటార్ గా సానియా మీర్జా ఎంపికయింది..ఈ మేరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఒక వీడియోను షేర్ చేసింది. ఈ మేరకు ఆర్ సీ బీ మహిళల క్రికెట్ జట్టుకు మెంటార్ గా ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉందని సానియా మీర్జా తెలిపింది. ఇక ఇటీవల వేలంలో టీం ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 3.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

Sania Mirza
Sania Mirza

ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో ఆడి తన కెరియర్ కు గుడ్ బై చెబుతున్నట్టు సానియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.. అయితే సానియా మీర్జా టెన్నిస్ వదిలి క్రికెట్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. భారతదేశంలో ఎంతో క్రేజీ ఉన్న మహిళల అథ్లెట్స్ లో స్మృతి, సానియా మీర్జా ముందు వరుసలో ఉంటారు.. ఇద్దరూ ఒకే జట్టులో ఉండడంతో హంగామా మామూలుగా ఉండదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించి ప్లేయర్ల వేలం ఫిబ్రవరి 13న జరిగింది. ఒక్కో జట్టు ప్లేయర్ల కోసం 12 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. స్మృతి అత్యధికంగా 3.4 కోట్ల ధర పలికింది. ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్ నర్ ను గుజరాత్ జెయింట్స్ 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అంతే మొత్తానికి ఇంగ్లాండ్ ప్లేయర్ నాట్ సీవర్ ను ముంబై కొనుగోలు చేసింది. కాగా ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. 23 రోజుల పాటు సాగనుంది.. మొదటి మ్యాచ్ డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version