
Remote Places: నగర జీవితం ర్యాట్ రేస్ లాంటిది. నిత్యం ఉరుకులు పరుగులు. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ ఇవి తప్ప మరో ప్రపంచం లేదు. చుట్టూ కాలుష్యం, మురుగు నీరు, వాహనాల రణగొణ ధ్వనులు. ఓ కాంక్రీట్ జంగిల్ లా ఉంటుంది. ప్రకృతికి, పచ్చదనానికి దూరంగా.. కాంక్రీట్ జంగిల్ లో పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అప్పుడప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ నుంచి పక్షిలా ఎగిరిపోవాలనిపిస్తుంది. పచ్చని మైదానం, చుట్టూ నీరు, ఒంటరిగా ఉన్న ఓ ఇంటిలో కొంతకాలం ఉండాలనిపిస్తుంది. ప్రశాంతమైన, రమణీయమైన, పచ్చని ప్రకృతి సోయగాల నడుమ ఓ కునుకు తీయాలనిపిస్తుంది. కానీ ఇది సాధ్యమా అని అనిపించొచ్చు. అలాంటి ప్రదేశాలు ఉంటాయా అని ఆశ్చర్యం కలగవచ్చు. అవును సాధ్యమే. అలాంటి ప్రదేశాలు ఉన్నాయి కూడా. ఈ స్టోరీలో వాటి విశేషాలేంటో చూద్దాం.
వాగర్, ఫారో దీవులు –
గసడలూర్ .. వాగర్ ద్వీపంలోని ములాఫోసూర్ జలపాతం దిగువున ఉంటుంది. దీనిని ఫారో దీవులలోని 18 ద్వీపాలలో ఒకటిగా చెప్పవచ్చు. వాగర్ .. డెన్మార్క్ దేశంలోని స్వయంపాలన ద్వీపం. ఇక్కడి అద్భుతమైన రాతి భూభాగాలు చూపరులను కట్టిపడేస్తాయి. పచ్చిక బయళ్లు, జలపాతం సోయగాలతో ప్రకృతి అందాన్ని వడబోసినట్టు ఉంటుంది. ఇక్కడి పర్వతాలు గసడలూర్ ను మిగిలిన ద్వీపాలను నుంచి వేరుచేశాయని చెప్పవచ్చు.
ఓరాజజటే, మెరాకో –
ఓరాజజటే అంటే ఎడారి తలుపు అనే మరో పేరు కూడా ఉంది. ఓరాజజటేలోని ఇళ్లు సహారా ఎడారి ప్రాంతంలోని పర్వతాల మధ్య ఉంటాయి. దీనికి సమీపంలోనే Aït Benhaddou అనే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరు పొందిన గ్రామం ఉంటుంది. అచ్చం దానిలాగానే ఓరాజజటే గ్రామం ఉంటుంది. ఓరాజజటే నిర్మాణం, అందుకు వాడిన కలప, ఇటుకలు అన్నీ Aït Benhaddou గ్రామాన్ని పోలి ఉంటాయి.

అలస్కా, యూఎస్ఏ-
ఇది అమెరికాలోని లాస్ట్ ఫ్రాంటియ్ లో ఉంటుంది. ఈ ఇల్లు పర్వతం దిగువున, పచ్చని చెట్ల మధ్య ఒంటరిగా, ఠీవీగా ఉంటుంది. ఇదొక అలస్కా అద్భుతమని చెప్పవచ్చు.

అర్నర్ స్టపి, ఐల్యాండ్ –
ఇది స్నాఫెల్నెస్ ద్వీపకల్పం దక్షిణాన ఉంటుంది. ఈ ఇల్లు ఎర్రటి పైకప్పుతో మౌంట్ స్టాఫపెల్ బేస్ వద్ద అర్నర్ స్టపి అనే చిన్న గ్రామంలో ఉంది. చుట్టూ మంచుతో కప్పబడి ఉంటుంది. పైన పర్వతం, ముందు నీటితో ఇంటి చట్టూ రమణీమయ మనోహర దృశ్యాలు కనివిందు చేస్తాయి.
ఎల్లియే, ఐల్యాండ్-
ఈ ఇల్లు వెస్ట్మన్నయ్జర్ ద్వీప సమూహంలోని ఎల్లియే ద్వీపంలో ఉంటుంది. దీనికి ప్రపంచంలోని ఒంటరి ఇల్లు అనే పేరు కూడా ఉంది. దీనిని ఎల్లియే హంటింగ్ అసోసియేన్ 1950లో నిర్మించింది. ఇదొక హంటింగ్ లాడ్జ్ అని చెప్పవచ్చు. ఇక్కడ జీవించడం చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చు.

పఫే మౌంటైన్ –
ఈ ఇంటి ఫోటోలు మొదటిసారి చూసినప్పుడు చాలా మంది నమ్మలేదు. దీనిని ఉనికిని గుర్తించలేదు. ఇదొక కల్పితంగా భావించారు. ఆ తర్వాత పోర్చుగీసు న్యూస్ స్టేషన్ ఈ ఇంటిని నివసించదగ్గ నిజమైన నిర్మాణంగా రుజువు చేసింది. ఇది పఫే పర్వతాలలో మారూమూల ప్రాంతంలో ఉంటుంది. మనం అక్కడికి వెళ్లాలంటే మాత్రం కొంచెం కష్టం. కాస్తంత ప్లానింగ్ ఉండాలి.

ఉత్తరాఖండ్ , ఇండియా –
ఈ ఇల్లు ఇండియాలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది గర్హ్వాల్ హిమాలయాలలో ఉంటుంది. చుట్టూ పర్వతాలు, చిన్న చిన్న రాతి గుట్టలు, పచ్చని గడ్డితో చూపురులను ఆకట్టుకుంటుంది.

రియా డి ఎటెల్, ఫ్రాన్స్ –
ఈ అందమైన చిన్న ఇల్లు రియా డి ఎటెల్ ఒడ్డున ఉన్న బ్రిట్టనీలో ఉంటుంది. ఇక్కడ నీరు, విద్యుత్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ.. దీని గొప్పతనం నిచ్చార్గర్ ద్వీపం అని చెప్పవచ్చు. చుట్టూ ప్రవహించే స్వచ్చమైన నీరు, మధ్యలో ఓ మట్టి ముద్ద లాంటి ఆకారం, దాని పై చిన్నటి ఇళ్లు రెండు నీలి రంగు కిటికీలతో చూపరులను కట్టిపడేస్తోంది.
కినాలిగ్, అజర్బైజాన్ –
ఇది సముద్రమట్టానికి 7000 కిలో మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇది ఒక పురాతన కాకేసియన్ గ్రామం. ఐరోపాలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో ఒకటి. చుట్టూ అందమైన ఎత్తైన పర్వత శ్రేణులు, ఓ పర్వతం పై కొన్ని ఇళ్లు, చూస్తేగానీ నమ్మలేనంత సౌందర్యంగా ఉంటుంది.

గ్లెన్కో, స్కాట్లాండ్ –
ఇది ఏకాంతానికి, అడవి అందానికి ప్రసిద్ధిగాంచిన స్కాటిష్ హైలాండ్. ఈ ప్రాంతం గ్లెన్కో లోయలో ఉంటుంది. ఇక్కడి ఇళ్లు చెల్లాచెదురుగా విసిరివేయబడ్డట్టు ఉంటుంది. సెలవుల్లో సేదతీరడానికి ఇదొక ప్రసిద్ధిగాంచిన ప్రదేశమని చెప్పవచ్చు.

పచ్చదనం, అందంతో నిండిన ఈ ప్రాంతాలు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనే తపన చాలా మందికి ఉంటుంది. గజిబిజి జీవితానికి ఇక్కడ ప్రశాంతత దొరుకుతుందని చెప్పవచ్చు. కానీ ఈ ప్రాంతాలను సందర్శించాలంటే ప్రణాళిక ఉండాల్సిందే. స్పష్టమైన ప్రణాళికతో ఈ ప్రాంతాలను వెకేషన్ కోసం తిరిగేసి రావొచ్చు.