https://oktelugu.com/

కంపెనీ వింత ఆఫర్.. వాలంటైన్స్ డే నాడు ఫ్రీగా విడాకులు..?

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికులు వాలంటైన్స్ డేగా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ఆరోజు చాలామంది తమ ప్రేమను ప్రేమించిన వ్యక్తులకు తెలియజేస్తారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఆరోజు జంటగా మారతారు. అయితే ఒక కంపెనీ మాత్రం వాలెంటైన్స్ రోజున ఒక జంటకు ఉచితంగా విడాకులు ఇప్పిస్తామని చెబుతోంది. అమెరికా లా కంపెనీ ఈ వింత ఆఫర్ ను ప్రకటించడం గమనార్హం. Also Read: శుభకార్యాలలో కంకణం ఎందుకు కట్టుకుంటారో తెలుసా..? అయితే కంపెనీ విడాకులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 4, 2021 2:41 pm
    Follow us on

    Free Divorce

    ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికులు వాలంటైన్స్ డేగా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ఆరోజు చాలామంది తమ ప్రేమను ప్రేమించిన వ్యక్తులకు తెలియజేస్తారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఆరోజు జంటగా మారతారు. అయితే ఒక కంపెనీ మాత్రం వాలెంటైన్స్ రోజున ఒక జంటకు ఉచితంగా విడాకులు ఇప్పిస్తామని చెబుతోంది. అమెరికా లా కంపెనీ ఈ వింత ఆఫర్ ను ప్రకటించడం గమనార్హం.

    Also Read: శుభకార్యాలలో కంకణం ఎందుకు కట్టుకుంటారో తెలుసా..?

    అయితే కంపెనీ విడాకులు కావాలని కోరుకుంటున్న కపుల్స్ లో ఒక కపుల్ కు ఉచితంగా లీగల్ సర్వీస్ చేయడంతో పాటు కోర్టు ఫీజులు కూడా తీసుకోబోమని చెబుతోంది. అమెరికాలోని టేనస్సీ క్రాస్‌విల్లేలోని పవర్స్ లా ఫర్మ్ ప్రకటించిన ఈ ఆఫర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రేమికుల దినోత్సవం నాడు కంపెనీ విడాకులు ఇప్పిస్తామని ప్రకటన చేయడం గమనార్హం. కెంపెనీ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

    Also Read: ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్.. రూ.2 వేల క్యాష్‌బ్యాక్ పొందే ఛాన్స్..?

    కంపెనీ ప్రకటనలో కరోనా విజృంభణ వల్ల ఈ సంవత్సరం భయంకరంగా గడిచిందని.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని.. అలా జరగడంతో ఒక లక్కీ కంటెస్టెంట్ కు ఉచితంగా విడాకులు ఇప్పించాలని తమ సంస్థ భావిస్తోందని కంపెనీ పేర్కొంది. వాలంటైన్స్ డే అనే పిచ్చి సంసృతి వల్ల ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఆ తరువాత ఇబ్బందులు పడి విడిపోవాలని భావిస్తున్నారని అలా విడిపోవాలని భావిస్తున్న ఒక జంటకు విడాకులు ఇప్పిస్తామని కంపెనీ పేర్కొంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఇక్కడ విడాకులు తీసుకోవాలంటే కనీసం 1150 డాలర్లు ఖర్చవుతుందని.. చాలామంది ఈ మొత్తం చెల్లించే స్థితిలో లేరు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫేస్ బుక్ ద్వారా కంపెనీ తెలిపింది. సంతానం లేని వాళ్లు మాత్రమే విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఫిబ్రవరి 19న విన్నర్ ను ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది.