Caste Politics : అగ్రకుల రాజకీయాధికారాన్ని ధిక్కరిస్తున్న తెలుగు సమాజాలు

రెండుగా తెలుగు రాష్ట్రాలు విభజించాక కూడా ఇంకా అగ్రకుల రాజకీయాధికారం కొనసాగుతోంది. ఆంధ్రలో అయితే రెడ్డిలు.. లేదంటే కమ్మ వారే రాజ్యాధికారం సాధిస్తున్నారు. ఇక తెలంగాణలో వెలమ సామాజికవర్గం రెండు సార్లు అధికార పీఠం దక్కించుకుంది.

Written By: NARESH, Updated On : July 18, 2023 5:01 pm
Follow us on

Caste politics : రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకమైన చైతన్యం ముందుకొస్తోంది. ఇది ఒకనాటి వర్గ చైతన్యం కాదు.. ఇటీవల నాటి ప్రాంతీయ చైతన్యం కాదు.. సామాజిక చైతన్యం.

ఒకనాడు ఆంధ్ర ప్రాంతంలో జస్టిస్ పార్టీ ప్రభావం ఉండేది. నాడు మద్రాస్ లో ఇది ప్రబలంగా పార్టీ ఉండేది. అయితే జస్టిస్ పార్టీ అధికారంలోకి రాలేదు. రెడ్డి సామాజికవర్గం నాడు ఎక్కువ కాలం పాలించింది. 1983లో మొట్టమొదటి సారి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆ సామాజికవర్గానికి పెద్దపీట దక్కింది. టీడీపీ అధికారంలోకి రావడంతో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాడు. బీసీలు ఎదగడానికి ఎన్టీఆర్ చొరవ చాలా కారణం.

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేసింది అగ్రకులాలే. రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణులు తప్పితే వేరే వాళ్లు చేయలేదు. దామోదరం సంజీవయ్య అనే దళిత నేత రెండేళ్లే చేశారు.

రెండుగా తెలుగు రాష్ట్రాలు విభజించాక కూడా ఇంకా అగ్రకుల రాజకీయాధికారం కొనసాగుతోంది. ఆంధ్రలో అయితే రెడ్డిలు.. లేదంటే కమ్మ వారే రాజ్యాధికారం సాధిస్తున్నారు. ఇక తెలంగాణలో వెలమ సామాజికవర్గం రెండు సార్లు అధికార పీఠం దక్కించుకుంది.

అగ్రకుల రాజకీయాధికారాన్ని ధిక్కరిస్తున్న తెలుగు సమాజాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..