Telugu Comedians Remuneration : ఈ 10 మంది కమెడియన్ల రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..

ఈ లెక్కన నాటి బ్రహ్మానందం నుంచి నేటి ప్రియదర్శిని వరకు కమెడియన్లు ఎంత పారితోషికం అందుకుంటున్నారో చూద్దాం..

Written By: NARESH, Updated On : September 19, 2023 4:03 pm
Follow us on

Telugu Comedians Remuneration : తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో కమెడియన్ కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. నాటి నుంచి నేటి వరకు ప్రతీ సినిమాలో దాదాపు కమెడియన్ ఉండేలా చూస్తున్నారు. కొన్ని సినిమాలు కమెడియన్లతోనే సక్సెస్ అయిన రోజులు ఉన్నాయి. అయితే రాను రాను సినిమాల్లో కమెడియన్లు కరువయ్యారు. ఈ నేపథ్యంలో ఉన్న వారికి డిమాండ్ పెరిగింది. ఇండస్ట్రీలోకి కొత్త వారు ఎంట్రీ ఇస్తున్నా.. కొందరు సీనియర్లకు ఉన్న ప్రాధాన్యత తగ్గడం లేదు. దీంతో వారికి రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెరిగింది. కొంత మంది కమెడియన్లు రోజువారీ చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన నాటి బ్రహ్మానందం నుంచి నేటి ప్రియదర్శిని వరకు కమెడియన్లు ఎంత పారితోషికం అందుకుంటున్నారో చూద్దాం..

సునీల్:
‘నువ్వు నేను’ సినిమాలో ఇండస్ట్రీకి పరిచయం అయిన సునీల్ ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించారు. ఆ తరువాత హీరోగా మారిపోయారు. అయితే ఇప్పుడు ఏ పాత్రలోనైనా ఇమిడిపోతున్నారు. ఈ తరుణంలో ఆయన సినిమాల్లో నటించినందుకు రోజుకు రూ.4 లక్షల చొప్పున పారితోషికం అందుకుంటారు.

అలీ:
దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. అలీ హీరోగా మారినా.. కమెడియన్ గా కొనసాగుతున్నారు. ఇప్పటి వారికి పోటీ ఇవ్వడంతో తనకు ప్రాధాన్యం తగ్గలేదు. ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతున్నా.. మరోవైపు అవకాశం వచ్చిన సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో ఆయన ఒక్కోరోజుకు రూ.3.5 లక్షల వరకు తీసుకుంటున్నారు.

బ్రహ్మానందం:
ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా లేదు. అయితే ప్రస్తుతం బ్రహ్మానందం వయసు రీత్యా తనకు తాను రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని సినిమాల్లో నటిస్తూ మిగతా సమయంలో రిలాక్స్ అవుతున్నారు. ఆయన సినిమాల్లో నటిస్తే రోజుకు రూ.3 లక్షల వరకు తీసుకుంటారు.

వెన్నెల కిశోర్:
‘వెన్నెల’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిశోర్ ఆ తరువాత తన ఫస్ట్ మూవీనే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఇప్పుడున్న కమెడియన్లలో బిజీగా ఉన్నది ఈయన మాత్రమే. దాదాపు ప్రతీ సినిమాలో వెన్నెల కిశోర్ కనిపించేందుకు ట్రే చేస్తున్నారు. దీంతో ఆయన ఒక్కో రోజుకు రూ.2 నుంచిరూ.3 లక్షల వరకు తీసుకుంటున్నారు.

సప్తగిరి :
రెండో తరం కమెడియన్ గా అలరిస్తున్నాడు సప్తగిరి. ఈయన కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. అయినా కమెడియన్ గానే కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక్కో రోజుకు రూ. 2 లక్షలకు పైగానే తీసుకుంటారు.

పోసాని కృష్ణమురళి:
రైటర్ గా, దర్శకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తుంటాడు. స్టార్ హీరోలతో సమానంగా నటించే ఈయన ఒక్కో రోజుకు రూ. 2.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

రాహుల్ రామకృష్ణ:
నేటి కుర్రాళ్లకు కావాల్సినంత నవ్వులు తెప్పించే నటుడిగా రాహుల్ రామకృష్ణ గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ యాసతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈక్ష్న రోజుకు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

పృథ్వీరాజ్:
‘30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’ అనే ఒకే ఒక్క డైలాగ్ తో సినీ ప్రేక్షకులను అలరించిన ఈయన టైమింగ్ కామెడీ అదిరిపోద్దీ. రీసెంట్ గా బ్రో మూవీలో కనిపించిన ఈయన ఒక్కో రోజుకు రూ.2 లక్షలు తీసుకుంటారు.

ప్రియదర్శి:
యంగ్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. షార్ట్ డైలాగ్స్ తో కామెడీ పండించే ప్రియదర్శి హీరోగానూ రాణిస్తున్నాడు. ఇటీవల ‘బలగం’లో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈయయ రోజుకు రూ.2 లక్షలు తీసుకుంటున్నారు.

శ్రీనివాసరెడ్డి:
రెండు దశాబ్దాల కింద ఇండస్ట్రీకి వచ్చిన శ్రీనివాస రెడ్డి తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగానూ అలరించిన ఈ యన రోజుకు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.