Telangana Politics : తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోందా? ముఖ్యంగా మోడీ వచ్చి నిజామాబాద్, మహబూబ్ నగర్ లో మాట్లాడిన తర్వాత బీజేపీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇన్నాళ్ల నుంచి బీజేపీ సమాధానం చెప్పుకోలేని స్థితి నుంచి అటాకింగ్ మోడ్ లోకి వచ్చింది. కేసీఆర్ గురించి మోడీ చెప్పిన రహస్యాలు జనాలకు బాగా ఎక్కాయి.
తెలంగాణలో చాపకింద నీరులాగా ఒక సామాజిక విప్లవం జరుగుతోంది. బీసీలు ఏకమై అందరూ కూడా బీజేపీ వైపు ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీనే మొదటి బీసీ. అయినా ఆయన కుల పట్టింపు లేకుండా మోడీ మా వాడు అంటూ అందరూ ఓన్ చేసుకుంటున్నారు.
తెలంగాణలో నిన్నటి దాకా బీజేపీ అధ్యక్షుడిగా బీసీ అయిన బండి సంజయ్ ఉన్నారు. గతంలో లక్ష్మణ్ కూడా బీసీనే. లక్ష్మణ్ ను ఏకంగా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. బీసీ అయిన ఈటల రాజేందర్ కు ఏకంగా పార్టీలో నంబర్ 2 పొజిషన్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో బీసీల నిశ్శబ్ధ విప్లవం రాబోతోందని అర్థమవుతోంది.
బీసీలే కేంద్రంగా తెలంగాణలో బీజేపీ రాజకీయ కదలికలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.