Film Reviews: సినిమా విడుదల రోజు అభిమానులు, క్రిటిక్స్ హంగామా మాములుగా ఉండదు. ఇక థియేటర్ల ముందు రివ్యూ చెప్పే వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మైండ్ బ్లోయింగ్ భయ్యా, సూపర్, హండ్రెడ్ డేస్ పక్కా అంటూ తెగ అరుస్తుంటారు. అంతేకాదు సినిమా నచ్చకపోతే తిట్టిని తిట్లు తిట్టకుండా తిడుతారు. స్టార్ హీరోల సినిమాలు గనుక నెగటివ్ టాక్ ను సంపాదిస్తే ఆ డైరెక్టర్ అభిమానుల చేతుల్లో అయిపోయినట్టే.. భూతులు తిట్టేస్తుంటారు. సోషల్ మీడియా, థియేటర్లు దద్దరిల్లుతుంటాయి కూడా. మరి వీల్లు ఇచ్చే రివ్యూల వల్ల సినిమాలకు నష్టం కూడా జరుగుతుంటుంది.
కొంతమంది కొన్ని సినిమాల విషయంలో ఉద్దేశపూర్వకంగా నెగటివ్ లేదా పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కొన్ని సార్లు సినిమాను దెబ్బ కొట్టాలని కూడా నెగటివ్ కామెంట్స్ చేస్తారు. ఇలాంటి వారి వల్ల సినిమాపై నెగటివ్ రావడమే కాదు కలెక్షన్లు కూడా భారీగా తగ్గుతుంటాయి. సినిమా బాలేదు అనే టాక్ వస్తే థియేటర్ కు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాలి అని ఎవరు అనుకుంటారు చెప్పండి? కానీ ఇది మాత్రం దర్శక నిర్మాతలకు నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ క్రమంలోనే కేరళలో ఓ రోమాలింటే అద్యతే ప్రాణాయం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముబీన్ రుయాఫ్ రివ్యూలపై హైకోర్టుని ఆశ్రయించారు.
ఇలా తన సినిమా విడుదలైన తర్వాత వారం రోజులపాటు ఎలాంటి రివ్యూ రాకూడదని కోర్టులో పిటిషన్ వేశారు ముబీన్. అయితే ఈయన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు సంచలనంగా మారింది. సినిమా పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉన్న రివ్యూలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. సినిమాను ఇబ్బంది కలిగిస్తూ, నెగటివ్ ప్రచారం చేసేలా ఉన్న రివ్యూల వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ ఆదేశాలు జారీ చేసింది కేరళ హైకోర్టు.
సినిమాపై నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పులేదని..కానీ సినిమా కలెక్షన్లకు అడ్డంపడేలా సినిమా రెపటేషన్ దెబ్బతీసేలా ఉండకూడదు అని హెచ్చరించింది. స్వార్థ ప్రయోజనాలతో ఉద్దేశపూర్వకంగానే సినిమాపై నెగటివ్ రివ్యూ ఇచ్చి సినిమాకు నష్టాలను కలిగించే విధంగా ఉండకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ తీర్పు పై కేరళ చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.ప్రతి ఒక్క చిత్ర పరిశ్రమలో కూడా ఈ విధమైనటువంటి తీర్పు వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సినిమాలకు రివ్యూ ఇచ్చేవారు ఈ కోర్టు తీర్పును గుర్తు పెట్టుకొని రివ్యూ ఇస్తే బాగుంటుంది. లేదంటే పొరపాటున నెగిటివ్ రివ్యూ ఇస్తే జైలు శిక్ష తప్పదు.