KCR vs Amit Shah: సెప్టెంబర్ 17.. ఈరోజు రాగానే తెలంగాణలో అలజడులు మొదలవుతాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో దీన్ని టీఆర్ఎస్ బాగా వాడుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో విమోచన దినాన్ని నిర్వహించడం లేదని.. తెలంగాణ ఏర్పడితే అధికారంలోకి వస్తే.. విమోచనను ఘనంగా నిర్వహిస్తామని కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు.కానీ కట్ చేస్తే.. అధికారంలోకి వచ్చాక మిత్రపక్షం ఎంఐఎం ఒత్తిడి.. ముస్లిం ఓట్ల కోసం ఆ విమోచనను పక్కనపెట్టారన్న అపవాదును మూటకట్టుకున్నారు. ఇప్పటికీ విమోచనపై కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ ను ఇరుకునపెడుతూనే ఉంటాయి. టీఆర్ఎస్ కు ఇది రాజకీయంగా ఎంతో నష్టం కలుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం చేయడానికి మనసు రాకపోవడం చర్చనీయాంశమైంది.

-అందిపుచ్చుకుంటున్న బీజేపీ
టీఆర్ఎస్ వదిలేసిన తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ అందిపుచ్చుకుంటోంది. ఎందుకంటే తెలంగాణ విముక్తికి పాటుపడింది గుజరాతీకే చెందిన నాటి ఉప ముఖ్యమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్. ఆయన భారత సైన్యంతో దాడి చేయించి మరీ హైదరాబాద్ ను దేశంలో విలీనం చేయించారు. అందుకే సర్ధార్ వల్లభాయ్ ను దేశమంతా ఫోకస్ చేయడంతోపాటు తెలంగాణలో బీజేపీ అధికారానికి బాటల వేయాలని బీజేపీ సెప్టెంబర్ 17 పేరుతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా టార్గెట్ చేసింది. ఈ చర్యతో అటు ఎంఐఎంను, కేసీఆర్ ను ఇద్దరినీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు బసవరాజు, ఏక్ నాథ్ షిండేలను ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంలోని పలు జిల్లాలు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందుకే ఇద్దరు సీఎంలు, కేంద్ర హోంమంత్రి ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించి కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసే ఎత్తుగడ వేస్తున్నాయి.
Also Read: AP Three Capitals: హైకోర్టు చెప్పినా తగ్గేదేలే.. మూడు రాజధానులకే జగన్ సై
-డిఫెన్స్ లో కేసీఆర్.. చేయక తప్పని పరిస్థితి
కేంద్రహోంమంత్రి, ఇద్దరు సీఎంలు హైదరాబాద్ కు వచ్చి మరీ తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారన్న ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఎంఐఎం, ముస్లిం ఓటు బ్యాంకును పక్కనపెట్టి మరీ తప్పని సరి పరిస్థితుల్లో కేసీఆర్ ఈ ‘తెలంగాణవిమోచన దినాన్ని ’ అధికారికంగా నిర్వహించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు కేబినెట్ లో సెప్టెంబర్ 17పై ప్రకటన చేయబోతున్నారని.. జిల్లాలు, హైదరాబాద్ సహా వాడవాడలా విలీన దినోత్సవాన్ని చేయడానికి ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలిసింది.

-రాజకీయ చదరంగంలో ‘తెలంగాణ’
తెలంగాణ ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ ల రాజకీయ చదరంగంలో పావుగా మారుతోంది. అధికారం కోసం బీజేపీ.. నిలుపుకోవాలని టీఆర్ఎస్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు అధికారికంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజల డబ్బులే కేసీఆర్, అమిత్ షాలు ఖర్చు చేస్తున్నారు. రెండూ కూడా ప్రజల్లో టీఆర్ఎస్, బీజేపీ పరపతి కోసం చేసేవి మాత్రమే. సెంటిమెంట్ ను ఓన్ చేసుకునేందుకు రెండు పార్టీలు ఈ విమోచన అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. మరి బీజేపీ విసురుతున్న ఈ గేమ్ లో కేసీఆర్ అందిపుచ్చుకొని పోటీనిస్తారా? సైలెంట్ గా ఉండి వ్యతిరేకత కొని తెచ్చుకుంటారా? అన్నది ఈరోజు తేలనుంది.
[…] […]