Telangana Is Number 1 In Startup Ranks: స్ట్రాటప్ లను ప్రొత్సహించడంలో తెలంగాణకు ‘సూపర్ స్టార్’ ర్యాంకు వచ్చింది. కేంద్రం సోమవారం ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ పేరు ఉండడం విశేషం. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రంగంలో చూపించిన ప్రతిభ ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ఈ జాబితాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రకటించారు. ఇందులో తెలంగాణకు ‘సూపర్ట్ స్టార్ ’ విభాగంలో మొదటి స్థానం దక్కింది. స్ట్రాటప్ లో ఉన్న సమస్యలపై వ్యవస్థాపకుల నుంచి వచ్చే ఫిర్యాదులను తెలంగాణలో టీ హబ్ సరైన సమాధానాలు ఇచ్చి పరిష్కరించింది. ఓపెన్ డాటా పాలసీ 2016 ద్వారా విభిన్న డిఫర్ట్ మెంట్లకు చెందిన డేటాను బహిర్గతం చేస్తూ పరిపాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేసింది. దీంతో తెలంగాణకు సూపర్ స్టార్ హోదా లభించింది.

స్ట్రాటప్ లను ప్రోత్సహించడంలో రాష్ట్రాల పనితీరును లెక్కించడానికి కేంద్రం ఏడు అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. దేశంలోని పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అంశాల పనితీరును పరిశీలిస్తారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా స్టాటప్ మెగాస్టార్స్, సూపర్ స్టార్స్, స్టార్స్, రైజింగ్ స్టార్స్, సన్ రైజర్స్ పేరుతో ఐదు విభాగాలను విభజిస్తారు. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు ఎలా ప్రొత్సహిస్తున్నారో పరిశీలించి వాటికి ర్యాంకులను ప్రకటించారు. ఇందులో తెలంగాణకు ‘సూపర్ స్టార్’ విభాగంలో మొదటి స్థానం దక్కింది. తెలంగాణ తరువాత కేరళ, మహారాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి జమ్మూకాశ్మీర్ ఉన్నాయి. కాగా మొదటి విభాగమైన మెగాస్టార్స్ లో గుజరాత్ మొదటిస్థానంలో ఉండగా.. ఐదో విభాగమైన సన్ రైజర్స్ విభాగంలో బీహార్ మొదటి స్థానం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ పేరు ఎక్కడా లేకపోవడం గమనార్హం.

స్ట్రాటప్ లను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం వి-హబ్ పేరుతో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. పెట్టుబడిదారులను అనుసంధానం చేయడానికి రూ.15 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు 50 కి పైగా స్ట్రాటప్ లు రూ. కోటి నిధులను అందుకున్నాయి. టీ-ఫండ్ కు అదనంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్ జీఎస్ టీ వాపసు చేస్తోంది. ఆయా కంపెనీల పనితీరు ఆధారంగా గ్రాంట్ మంజూరు చేస్తోంది. రాష్ట్రంలో నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమంలో 800 స్ట్రాటప్స్, 150 మందికి పైగా భాగస్వాములయ్యారు. అలాగే స్ట్రాటప్ కు అవసరమైన మద్దతు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం 250 మందికి పైగా అధికారులకు అవగాహన కల్పించింది. 350 మందికి పైగా ప్రైవేట్ పెట్టుబడిదారులను స్ట్రాటప్ లకు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహిస్తోంది.
Also Read: CM KCR: కేసీఆర్ కు దారేది..?
ఇదిలా ఉండగా కేంద్రంల ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు ఎక్కడా కనిపించలేదు. దేశంలో వెనుకబడిన బీహార్ లో కూడా స్ట్రాటప్ లను ప్రోత్సహించడంలో కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. కానీ ఏపీలో అలాంటి అవకాశం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా తెలంగాణలో బలమైన స్ట్రాటప్ వాతావరణం ఉన్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2016 నుంచి 2021 వరకు ఈ రంగంలోని పెట్టుబడుదారులను ప్రోత్సహిస్తూ వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపింది.