Governor Tamilisai Vs KCR: ఇన్నాళ్లూ గవర్నర్‌కు కనీస మర్యాద ఇవ్వకుండా, ప్రొటోకాల్ పాటించకుండా, కేవలం రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేస్తూ వచ్చింది తెలంగాణ సర్కార్. ఇన్నాళ్లూ కేసీఆర్ టైం నడిచింది. ఇక ఇప్పుడు గవర్నర్ వంతు వచ్చింది. 2023–24 బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తప్పనసరి. ఆమోదం కోసం పంపించి మూడు రోజులైనా గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో తెలంగాణ సర్కార్‌లో టెన్షన్ మొదలైంది. ఏం జరుగబోతోంది అన్న టెన్షన్ సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

-టార్గెట్ కేసీఆర్..
తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం పీక్ స్టేజ్ కి చేరింది. ఇప్పటికే గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలను రాజ్‌భవన్‌కు పంపించారు. కానీ, ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. రాజ్ భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం, ఆ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం, గవర్నర్ తన ప్రసంగంలోనూ కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ కట్టడాలు, బిల్డింగులు కట్టడం అభివృద్ధి కాదంటూ గవర్నర్ మాట్లాడారు. తెలంగాణలో రోజుకు 22 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. గవర్నర్ ప్రసంగం పై బీఆర్‌ఎస్ నేతలు ఫైర్ అయ్యారు.
-బడ్జెట్‌పై ఉత్కంఠ..
ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. అయితే అంతకుముందు గవర్నర్ ఆమోదం తప్పనసరి. అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత కూడా ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. రెండు దశల్లో గవర్నర్ ఆమోదం తప్పనిసరి. మొదటి దశ ఆమోదం కోసం మూడు రోజుల క్రితమే బడ్జెట్ ప్రతిపాదనలు రాజ్ భవన్‌కు ప్రభుత్వం పంపింది. అయితే, ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం తెలుపలేదు.

-కోర్టును ఆశ్రయించనున్న సర్కార్
ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2వ తేదీ వరకు గవర్నర్ ఆమోదం తెలిపేందుకు సమయం ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో న్యాయ పోరాటానికి సర్కార్ సిద్ధమైంది. బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది. గవర్నర్ తీరును సవాల్ చేస్తూ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయరక దుశ్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు. బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదించని ఈ వివాదంపై కోర్టు ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.
మొత్తంగా ఒక గవర్నర్ కోర్టుకు ఎక్కిన చరిత్ర దేశంలోనే లేదు. తొలిసారి ఇలా చేస్తూ కేసీఆర్ దేశంలో పెను సంచలనానికి దారితీశారు.