Milk: మనకు ఆరోగ్యాన్ని అందించే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది మాంసాహారాలే బలమైనవిగా నమ్ముతుంటారు. కానీ వాటికంటే ఎన్నో రెట్లు బలమైన ఆహారాలు ఉన్నాయి. మాంసాహారంతో ప్రొటీన్లు లభిస్తాయని చెబుతారు. కానీ శాఖాహారాల్లో మనకు పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి. దీంతో వాటిని తీసుకోవడం ద్వారా మన తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. జంతు సంబందమైన ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మన మెదడు మొద్దుబారిపోతుందని తెలిసినా వాటిని మానడం లేదు.

కార్బోహైడ్రేడ్లు అధికంగా ఉండే బ్రెడ్, పాలు, వెన్న లాంటి పదార్థాలు తీసుకుంటే మెదడు చురుకుగా పని చేస్తుందట. తెలివితేటలు సమృద్ధిగా పెరుగుతాయట. దీంతో వాటిని తీసుకోవడం ఎంతో ఉత్తమం. వీటిని తినడం వల్ల నిర్ణయాత్మక శక్తి చురుకుగా మారుతుంది. ఆర్థిక పరమైన నిర్ణయాల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకే సాత్వికమైన ఆహారాలు తీసుకుంటేనే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. రోజు ఇలాంటి ఆహారాన్ని టిఫిన్ గా తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి.
జర్మనీ దేవంలో జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది పాల సంబంధమైన ఉత్పత్తులు తీసకుంటే మెదడు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని తేలింది. దీంతో అల్పాహారంలో వీటితో తయారు చేసిన వాటిని తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. నూనెలో దేవినవి కాకుండా పాలతో చేసన వాటితో టిఫిన్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏది పడితే అది తింటూ కడుపును ఇబ్బందులకు గురి చేసే బదులు మంచి ఆహారాలను ఎంచుకోవడం ప్రధానమే.

ఈ నేపథ్యంలో మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే మంచి ఆహారాలు తీసుకుని మన దేహాన్ని ఇబ్బందులకు గురి చేయకూడదు. పాల ఉత్పత్తులను ఉదయం పూట తింటే మనకు ప్రొటీన్లు అందుతాయి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే రోగాలకు మూలంగా మారుతాం. ఇక ఆస్పత్రుల చుట్టు తిరిగినా ప్రయోజనం ఉండదు. జబ్బులు రాకుండా ూసుకోవడమే మంచిది. వచ్చాక తిప్పలు పడితే ఏం లాభం. ఇలా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే.