Telangana BJP : మూడు కీలక వ్యూహాలతో బరిలోకి తెలంగాణ బీజేపీ

ఇప్పుడు బీజేపీ కూడా కీలకమైన మూడు వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.. బీజేపీ చివరకు అస్త్రాలను వదలిపెట్టకుండా ముందుకెళుతోంది.. బీజేపీ వ్యూహాలు ఏంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 25, 2023 6:25 pm

Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. మొన్నటి వరకూ వెలుగు వెలిగిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలో మూడో స్థానానికి పడిపోయిందని సర్వేలన్నీ చెబుతున్నాయి. బీజేపీది తెలంగాణలో మూడో స్థానమేనని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని అయితే సింగిల్ డిజిట్ వరకే బీజేపీ పరిమితం అవుతుందని అంటున్నాయి. ఎన్నికలకు ఇంకా 5 వారాల టైం ఉంది. రాజకీయాల్లో 5 వారాలు చిన్న విషయం అయితే చాలు. ప్రతీ సారి మ్యాజిక్ కాకపోవచ్చు. కానీ ఈ టైంలో రాజకీయాలు ఎప్పుడైనా మారవచ్చు.

2018 ఎన్నికల్లో అన్ని సర్వేల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. అసలు పబ్లిక్ టాక్ అంతా కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మోత మోగించాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు పెట్టుకొని పోటీచేశారు. హైదరాబాద్ సెటిలర్లు అంతా వీరికే ఓటు వేస్తారని అన్నారు.వారు చెప్పిన రోజుకు పరిస్థితి అలానే ఉంది.

చివరి మూడు వారాల్లో మొత్తం పరిస్థితి మారింది. చంద్రబాబు వచ్చి కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేయడంతో దాన్ని ఆయుధంగా మలిచి కేసీఆర్ ‘ఇంకా తెలంగాణలో ఆంధ్రుల పాలన కావాలా? చంద్రబాబు మోచేతి నీళ్లు తాగాలా’ అని ఆంధ్ర వాదన తెరపైకి తెచ్చి గెలిచాడు. ఆ సెంటిమెంట్ ను బాగా రెచ్చగొట్టి తెలంగాణప్రజానీకంలో మార్పు తీసుకొచ్చాడు. ఫలితం తారుమారైంది.

ఇప్పుడు బీజేపీ కూడా కీలకమైన మూడు వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.. బీజేపీ చివరకు అస్త్రాలను వదలిపెట్టకుండా ముందుకెళుతోంది.. బీజేపీ వ్యూహాలు ఏంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.