Prosopagnosia: సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే రాము (పేరు మార్చాం) అర్ధరాత్రి తన ఇంటికి వచ్చాడు.. డోర్ తీసిన తన భార్యను చూసి ఎవరు నువ్వు? అన్నాడు. అదేంటి నేనూ మీ భార్యను కదా..!! అని ఆమె గట్టిగా సమాధానం ఇచ్చింది. వెంటనే తన తలపై చిన్నగా కొట్టుకొని నిజమే కదా? అని లోపలికి వెళ్లాడు. మరునాడు ఉదయం పాలు పోసే వ్యక్తి రాగానే అతని దగ్గర అదే పరిస్థితి. తనను గుర్తుపట్టకపోయేసరికి సదరు వ్యక్తి అయోమయానికి గురయ్యాడు. దీంతో తన భార్య రాముని గమనిస్తూ ఆందోళన చెందుతోంది. ఇలాంటి సంఘటనలు నగరాల్లో పనిచేసేవారికి సాధారణమైపోయింది. కానీ వారి ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్లు, సహోద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత వాళ్లను సైతం గుర్తుపట్టలేని విధంగా ఇలా ఎందుకు తయారవుతున్నారు? అసలేమైంది? అన్న ఆలోచనలో పడ్డారు.
ప్రతి రోజూ రాము ఇలాగే ప్రవర్తించే సరికి అతని భార్య వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. రాముని పూర్తిగా పరీక్షించిన తరువాత అతడు జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు గ్రహించారు. అయితే ప్రస్తుతం దానికి ‘ప్రోసోపాగ్నోసియా’ అని నిర్దారించారు. దీనిని ‘ఫేస్ బ్లైండ్ నెస్’ అని కూడా పిలుస్తారు. ఈ కేసులు చాలా సాధారణం కానప్పటికీ అరుదుగా మాత్రం గ్రహించరాదు అని వైద్యడు తెలిపాడు. అయితే రాము బలహీనంగా ఉన్నాడా? అని పరీక్షిస్తే అతని అవయవాల కదలికలో ఎలాంటి లోపాలు లేవని గుర్తించారు. కాకపోతే ఇటీవలే అతనికి బీపీ, ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ నిర్దారణ అయింది.
ఎంఆర్ఐలో స్పష్టం..
ఈ తరుణంలో స్పష్టమైన నిర్దారణకు వైద్యుడు తలను ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలని సూచించారు. ఈ రిపోర్టు పరీక్షించిన తరువాత ఇది కంప్లీట్ ‘ఫేస్ బ్లైండ్ నెస్(ముఖ అంధత్వం)’ అని నిర్దారించుకున్నారు. MRI చూపించిన రిపోర్టులో కుడి ఆక్సిపిటల్ లోబ్ లో తీవ్రమైన ఇన్ఫార్క్ (రక్తం గడ్డకట్టడం) చూపించింది. ఇది కూడి ఫ్యూసిఫార్మ్ గైరస్ ను ప్రభావితం చేస్తుంది. దీంతో మెదడు ఇతరులను గుర్తుపట్టడంతో అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంది. ఈ సమస్య ఉన్నవారు వ్యక్తుల ముఖాలు, పదాలు లాంటివి మర్చిపోతుంటారు.
నాడీ వ్యవస్థ దెబ్బతినడంతోనే..
ఫ్రొసోపాగ్నోసియా అనేది నాడీ సంబంధిత రుగ్మత. మెదడు నుంచి సమాచారాన్ని నాడీ ద్వారా ఇతర అవయవాలకు పనిచేసే వ్యవస్థ దెబ్బతినడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వీరు గొంతును గుర్తిస్తాచరు. అలాగే దుస్తులు, నగలు లేదా నడక ఆధారంగా తమ విషయాలను గుర్తుతెచ్చుకుంటారు. ఇలాంటి సమస్య కేవలం రాము కే కాదు. ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు ఈ రుగ్మతతో బాధపడుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అలాంటి వారిలో హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ ఫిట్, ఆపిల్ సహా వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్, ప్రైమటాలజిస్టు జేన్ గుడాల్ లు ఉన్నారు.
ఈ రుగ్మతపై సీరియల్..
ఫేస్ బ్లైండ్ నెస్ పై కొన్ని సినిమాలు, సిరీస్ లు కూడా వచ్చాయి. 2012 నుంచి 2015 వరకు అమెరికాలోని పర్సెప్షన్ టీవీలో ఫ్రొసోపాగ్నోసియా ఎలా వస్తుంది? దాని ప్రభావం ఎలా ఉంటుంది? అని సీరియల్ ను ప్రసారం చేశారు. ఇది ప్రముఖంగా వ్యక్తి ఇతర వ్యక్తులను గుర్తుపట్టకపోవడం, వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? అనే కాన్సెప్టుతో తీశారు. మన సౌత్ లో కూడా ‘గజిని’ మూవీ దీనిని పోలే ఉంటుంది. అయితే దీని బారిన పడ్డవారు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. కానీ వారు తమ వ్యాధిని గుర్తించలేకపోతున్నారు.
ప్రపంచంలో 2వ వంతు..!
అయితే ప్రపంచ జనాభాలో ఫ్రొసోపాగ్నోసియాతో బాధపడుతున్నవారు 2 నుంచి 2.5 శాతం ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. అంటే ప్రతీ 100 మందిలో ఇద్దరు దీని బారిన పడుతున్నారు. సాధారణంగా మెదడు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్య ఎదుర్కొంటారని తెలుస్తోంది. బెంగుళూరుకు చెందని ఓ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస రాజేంద్ర తరతరాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొందరు వ్యక్తులను గుర్తుపెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక పరికరం చేతిలో పట్టుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పడం గమనార్హం.

మరి దీనికి చికిత్స లేదా?
మరి దీనికి చికిత్స లేదా? అంటే ఉందంటున్నారు. ఫ్రొసోపాగ్నోసియా ను ముందుగా న్యూరాలజిస్టును గుర్తించినా.. ఆ తరువాత సైకాలజిస్టులే దీనిని పరిస్కరిస్తారని అంటున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా మెడిసిన్ లేకపోయినా గుర్తుపట్టే విధంగా సూచలను, ముఖ లక్షణాలు మెదడులో నిక్షిప్తం అయ్యే విధంగా కొన్ని చర్యలు చేపట్టాలంటున్నారు. సాంకేతికంగా కూడా కొన్ని యాప్ లు వీరి కోసం క్రియేట్ చేయబడ్డాయని వైద్యులు చెబుతున్నారు.