IND vs NZ : అదృష్టం మనవైపే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. దంచి కొట్టి ఔట్ అయిన రోహిత్

టాస్ గెలిచిన జట్టు ముంబైలో 5కు 5 సార్లు గెలిచింది. ఇక రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించింది.

Written By: NARESH, Updated On : November 15, 2023 2:52 pm
Follow us on

IND vs NZ : అన్నట్టే వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో అదృష్టం మనవైపే చేరింది. టీమిండియా కీలకమైన సెమీస్ పోరులో టాస్ గెలిచింది. వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ మరో మాట లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే పిచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వారిదే విజయం. ఆ ట్రాక్ రికార్డ్ అలా ఉంది. అందుకే రోహిట్ ముందుగా గెలవగానే బ్యాటింగ్ తీసుకున్నాడు.

అన్నట్టుగానే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ ప్రధాన బౌలర్లు అయిన ట్రెంట్ బౌల్ట్, సోథిలను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్సులతో బెంబేలెత్తించాడు. 29 బంతుల్లోనే 47 పరుగులు చేసి భారీ స్కోరుకు కారణమయ్యాడు. దీంతో టీమిండియా 9 ఓవర్లలోనే 76 పరుగులు చేసింది.

ఇక వచ్చీరావడంతో విరాట్ కోహ్లీ ఓ పెద్ద ఎల్బీడబ్ల్యూ నుంచి బయటపడ్డాడు. బ్యాట్ కు బంతి తగలడంతో బతికిపోయాడు. రోహిత్ వెళ్లిపోయాక స్కోరును పెంచే బాధ్యతను గిల్ తీసుకున్నాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి టచ్ లోకి వచ్చాడు.

టాస్ గెలిచిన జట్టు ముంబైలో 5కు 5 సార్లు గెలిచింది. ఇక రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించింది. దీంతో ఇక బ్యాటింగ్ తీసుకొని టీమిండియా ప్లేయర్లు ఈ దంచుడు పని మీదనే ఉన్నారు.