Homeట్రెండింగ్ న్యూస్Brazilian Teacher: పంతులమ్మ గాడి తప్పింది; విద్యార్థులతో ఆ పాఠాలు మొదలెట్టింది

Brazilian Teacher: పంతులమ్మ గాడి తప్పింది; విద్యార్థులతో ఆ పాఠాలు మొదలెట్టింది

Brazilian Teacher: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవభవ… అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే.. తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఆ జన్మకు విద్యాబుద్ధులు నేర్పి ఒక సార్థకత కలిగించే వారు గురువులు. అందుకే ఈ ప్రపంచం మొత్తంలో గురువులకు విశిష్ట స్థానం ఉంటుంది. కానీ కాలక్రమంలో అన్ని వ్యవస్థలు కునారిల్లుతున్నట్టే.. విద్యావ్యవస్థ కూడా రోజురోజుకు బ్రష్టు పట్టిపోతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ అన్ని వేళ్ళు ఉపాధ్యాయులవైపై చూపిస్తున్నాయి. తాజాగా బ్రెజిల్ దేశంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు యావత్ ఉపాధ్యాయ లోకాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ఇవేం వెకిలి చేష్టలు

ఆ మధ్య అమెరికాలో విద్యార్థులతో మహిళ ఉపాధ్యాయినులు నెరిపిన శృంగార కేలి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యార్థులను గాడిలో పెట్టాల్సిన ఉపాధ్యాయినులు వారితో ఏకంగా పడక పంచుకోవడం మొదలుపెట్టారు. అది ఒక స్థాయి దాటి ఏకంగా వారిని లేపుకెళ్లే దాకా వెళ్ళింది.. హైదరాబాదులో ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్ పదో తరగతి చదువుతున్న విద్యార్థిని తో ప్రేమ పాఠం మొదలుపెట్టింది. ఏకంగా అతడితో సంసారం చేసింది. అయితే ఇలాంటి ఘటనలు బ్రష్టు పట్టిపోతున్న మన విలువలను ప్రశ్నిస్తున్నాయి. ఇవన్నీ కూడా తెరచాటు వ్యవహారాలు అయితే.. బ్రెజిల్ లో ఓ మహిళా ప్రొఫెసర్ ఏకంగా తరగతి గదిలోనే ఆ పాఠాలు మొదలుపెట్టింది. పైగా వీటిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది..

అసభ్యకరమైన రీతిలో డ్యాన్స్

బ్రెజిల్ దేశానికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. కురచ దుస్తులు ధరిస్తూ రెచ్చగొట్టేలాగా పోస్టులు పెడుతుంది. తాజాగా తరగతి గదిలో విద్యార్థులతో అసభ్యకరమైన రీతిలో డ్యాన్సులు వేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. టిక్ టాక్ లో కూడా షేర్ చేసింది. దీంతో ఆ వీడియోలను చూసిన నెటిజన్లు ఆ మహిళా ప్రొఫెసర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. విద్యార్థులతో ఆమె కలిసి చేసిన డ్యాన్స్ వైరల్ కావడంతో.. సదరు విద్యాసంస్థ ఉద్యోగం నుంచి తొలగించినట్టు బ్రెజిల్ మీడియా పేర్కొన్నది. అయితే ఈ వ్యవహారంలో ఆమెకు కొంతమంది మద్దతుగా నిలవడం ఇక్కడ విశేషం.

ఇంగ్లీష్ టీచర్ గా..

బ్రెజిల్ దేశానికి చెందిన సిబెల్లి ఫెరీరా అక్కడి ఓ విద్యాలయంలో మహిళ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆమె ఇంగ్లీష్ బోధిస్తారు. సామాజిక మాధ్యమాల్లో కురచ దుస్తులు వేస్తూ అంగంగా ప్రదర్శన చేసే వీడియోలు పెడుతుంది కాబట్టి, సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన పాపులారిటీ ఉంది. టిక్ టాక్ లాంటి యాప్ లో ఆమెను 9.8 మిలియన్ల ప్రజలు ఫాలో అవుతున్నారు..ఇన్ స్టా లో అయితే ఏకంగా 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి, వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేయాల్సిన ఈమె గాడి తప్పింది. సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తరగతి గదిలో విద్యార్థులతో కలిసి అశ్లీల కరమైన డ్యాన్సులు చేస్తోంది.. వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోండి. అయితే ఆమె తీరు పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ” సామాజిక మాధ్యమాలు మన జీవితంలోకి అత్యంత వేగంగా దూసుకు వచ్చాయి. వినియోగించడం మన నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇలాంటప్పుడు విద్యార్థులు వాటిని మదిలోకి రాకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించడం అంత సులువు కాదు.. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించేందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నట్టు” ఫెరీరా అక్కడి మీడియాతో పేర్కొనడం విశేషం. అయినప్పటికీ ఫెరీరా వస్త్రధారణ దారుణంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

కొంతమంది మద్దతుగా..

సామాజిక మాధ్యమాల్లో ఫెరీరాను అనుసరించేవారు ఆమె చర్యలను సమ్మతిస్తున్నారు. ఆమె తీసుకొచ్చిన మార్పులు విద్యార్థులకు వినోదభరితమైన విద్యను అందిస్తాయని చెబుతున్నారు. చదువుపై ఆసక్తి కలిగించేందుకు నృత్యాలు చేస్తే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా నూతన విద్యా విధానం వైపు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించడం బాధాకరమంటూ కామెంట్లు చేస్తున్నారు. సామాజిక మధ్యమ లో భారీగా అభిమానులను పెంచుకున్న ఈ టిక్ టాక్ స్టార్ట్ టీచర్ బ్రెజిల్ లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ లావ్ రాస్ నుంచి జీవశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిన నేపథ్యంలో ” అకడమిక్స్ లో నీ కెరియర్ విస్తరించుకోవాలి. పూర్తి కాలం ఇన్ఫ్లుయన్సర్ గా మారాలని” ఆమె అభిమానులు సలహా ఇస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular