TDP Twitter Account: రాజకీయం రంగు మారింది.. ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు సతీమణిని అయినా.. నారా లోకేష్ ను అయినా ఆన్ లైన్ లోనే ట్రోల్ చేస్తున్నారు. ఇటు టీడీపీ బ్యాచ్ సైతం సోషల్ మీడియానే ఆయుధంగా చేసి వైసీపీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఈ ‘సోషల్’ ఫైట్ లో తాజాగా టీడీపీ చిత్తైంది. వైసీపీ గెలిచింది.

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ట్విట్టర్ లో టీడీపీ అకౌంట్ కోసం టైప్ చేస్తే ‘టైలర్ హాబ్స్’ (Tyler Hobbs) అనే అకౌంట్ టీడీపీ హ్యాండిల్ తో ప్రత్యక్షమవుతోంది. అంతేకాదు ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయి.దీంతో తెలుగుదేశం అభిమానులు అవాక్కయ్యారు. తమ తెలుగుదేశం పోస్టులు ఏవి? అవి ఎలా మాయమయ్యాయి? ఇవేం పోస్టులు అని అంతా నోరెళ్లబెడుతున్నారు.
దీనిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను అధికార వైసీపీ మద్దతు ఉన్న నికృష్టపు శక్తులు హ్యాకింగ్ చేశాయని ఆరోపించాయి. . త్వరలోనే టీడీపీ అకౌంట్ ను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.
ఇక రంగంలోకి దిగిన టీడీపీ టీం.. నిపుణులైన సాఫ్ట్ వేర్ టెకీలతో అధికారిక టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ను తిరిగి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
గతంలోనూ టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. కొన్ని గంటల పాటు శ్రమించిన తర్వాత ఖాతాను మళ్లీ పునరుద్దరించారు. రాజకీయంగా కత్తులు దూసుకుంటున్న టీడీపీ, వైసీపీలు.. ఇలా ఆన్ లైన్ లో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఇందులో టీడీపీ ఇలా రెండు సార్లు హ్యాకింగ్ కు గురై దెబ్బైపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
[…] […]