https://oktelugu.com/

నెలకు రూ.3,555 చెల్లిస్తే కొత్త కారు.. ఎలా అంటే..?

దేశంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వాళ్లు కారు లేకపోతే కొత్తకారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలా కొత్తకారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. నెలకు 3,555 రూపాయల చొప్పున సులభ వాయిదాల్లో చెల్లించడం ద్వారా కొత్తకారును కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. టాటా టియాగో మోడల్‌ కారును తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. Also Read: రూ.877కే విమాన ప్రయాణం చేసే అవకాశం… […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2021 / 07:12 PM IST
    Follow us on


    దేశంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వాళ్లు కారు లేకపోతే కొత్తకారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలా కొత్తకారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. నెలకు 3,555 రూపాయల చొప్పున సులభ వాయిదాల్లో చెల్లించడం ద్వారా కొత్తకారును కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. టాటా టియాగో మోడల్‌ కారును తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

    Also Read: రూ.877కే విమాన ప్రయాణం చేసే అవకాశం… కానీ..?

    టాటా మోటార్స్ వెబ్ సైట్ లో ఇప్పటికే ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. బీఎస్ 6 ఇంజిన్ తో తయారైన ఈ కారు స్పోర్టీ డిజైన్ తో తయారు కావడం గమనార్హం. ఈ ఆఫర్ ద్వారా టాటా టియాగో ఏ వేరియంట్ కారునైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 1.2 లీటర్ ఇంజిన్ తో ఈ కారు అందుబాటులో ఉంది. రియర్ వ్యూ కెమెరా, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈడీబీ, ఇతర ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

    Also Read: బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబర్ మార్చుకోవాలా..? ఎలా అంటే..?

    ఈ కారు ఎక్స్ ‌షోరూమ్ ధర 4,70,000 రూపాయల నుంచి ప్రారంభం కానుండగా వేరియంట్ ను బట్టి ధరలలో మార్పులు ఉంటాయి. ఇప్పటికే టాటా టియాగో కారును లక్షల సంఖ్యలో వాహనదారులు కొనుగోలు చేశారు. సమీపంలోని టాటా షోరూంను సంప్రదించి ఈ ఆఫర్, డౌన్ పేమెంట్, ఇతర వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. కారు వేరియంట్ ను బట్టి చెల్లించే డౌన్ పేమెంట్ మొత్తంలో మార్పులు ఉంటాయి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    టాటా మోటార్స్ వెబ్ సైట్ ద్వారా ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఇతరులతో పోలిస్తే ఉద్యోగులకు ఈ అఫర్ బాగుంటుందని చెప్పవచ్చు.