Annamalai Padayatra: తమిళనాడులో అన్నామలై లేకపోయినా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. దాదాపు రెండు వారాలుగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నామలై బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అన్నామలై తమిళనాడుకు తిరిగివచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో తమిళనాడులో రాజకీయాలు చాలా మారాయి. అన్నమలై బాధ్యతను గవర్నర్ ఆర్ఎన్ రవి తీసుకున్నారు.
తమిళనాడు మొత్తం కూడా ‘ద్రవిడ వర్సెస్ జాతీయ భావాల’ చర్చ, రచ్చ జరుగుతోంది. గవర్నర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం పెద్ద వివాదమైంది. కేబినెట్ ఆమోదించిన ప్రసంగంలో కొన్ని భాగాలు తమిళనాడు గవర్నర్ చదవలేదు. ముఖ్యంగా ఎక్సలెంట్ లా అండ్ ఆర్డర్ లేదంటూ చెప్పుకొచ్చాడు. పీఎఫ్ఐ వాళ్లను అరెస్ట్ చేస్తే ఐదురోజులుగా కంటిన్యూస్ గా బాంబు దాడులు జరుగుతుంటే తమిళనాడులో శాంతిభద్రతలు ఉన్నాయని ఎలా చదవాలని గవర్నర్ ప్రసంగించారు.
మహిళా కానిస్టేబుల్ పై డీఎంకే నేతలు దాడి చేశారు. ఇసుక మాఫియా ఏకంగా ఒక డీఏవోను చంపేసింది. ఇక ఎక్స్ లెంట్ టెంపుల్ మేనేజ్ మెంట్ అని చదవమంటే చదవనని గవర్నర్ తేల్చిచెప్పాడు. ఒక టెంపుల్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది.
అన్నామలై లేని లోటును గవర్నర్ తీరుస్తున్నారు. అన్నామలై పాదయాత్రకు ముందే శరవేగంగా మారుతున్న తమిళ రాజకీయాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..