https://oktelugu.com/

Photo Story: ఈ ఫోటోలో ఉన్న బ్యూటీ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టండి.

భీష్మ సినిమాతో రష్మిక కెరీర్ కి పూల బాటలు వేశాయి. టాప్ డైరెక్టర్లు సైతం తన డేట్స్ కోసం పోటీ పడే పరిస్థితి నెలకొంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ పట్టేసిన ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 29, 2024 / 03:49 PM IST
    Follow us on

    Photo Story: సినిమా రంగంలో ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో.. ఎవరు స్టార్లుగా ఎదుగుతారో తెలుసుకోవడం చాలా కష్టమే. కొందరికి అదృష్టం కలిసి వస్తే.. కొందరు మాత్రం డీలా పడతారు. మరికొందరు మాత్రం పార్ట్ టర్మ్ లోనే స్టార్ స్టేటస్ ను సంపాదిస్తారు. అలాంటి హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ముఖానికి సెల్ ఫోన్ అడ్డంగా పెట్టుకొని కిక్కిచ్చిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఈ హీరోయిన్ పట్టిందల్లా బంగారమే అయింది. కెరీర్ తొలినాళ్లలో కుర్రకారు పల్స్ పట్టేసి వెండితెరపై అందాల గాలం వేసింది.

    ఈ అమ్మడికి బోలెడన్ని ఆఫర్లు తలుపుతడుతున్నాయి. ఈ అమ్మడు టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతున్న రూమర్లు కూడా వస్తున్నాయి. ఈ హింట్స్ తో మీకు ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది. ఆమెనే కన్నడ భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాతో బిజీ హీరోయిన్ అయింది. కెమెరా ముందు తనదైన ప్రతిభ కనబరుస్తూ నేషనల్ క్రష్ గా క్రేజ్ కొట్టేసింది. తెలుగులో విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు మంచి హిట్ లను ఇచ్చాయి.

    భీష్మ సినిమాతో రష్మిక కెరీర్ కి పూల బాటలు వేశాయి. టాప్ డైరెక్టర్లు సైతం తన డేట్స్ కోసం పోటీ పడే పరిస్థితి నెలకొంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ పట్టేసిన ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉంది. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ సాధించిన రష్మిక రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది.

    యాడ్స్, సోషల్ మీడియా ద్వారా సైడ్ ఇన్ కమ్ జెనెరేట్ చేసుకుంటోంది రష్మిక. సినిమాలతో పాటు తన సంపాదన, ఇన్వెస్ట్మెంట్ విషయంలో రష్మిక చాలా శ్రద్ద తీసుకుంటుందట. వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో రష్మిక మందన్న పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుందట. ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న రష్మిక. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్ ల ద్వారా డబ్బు పోగు చేస్తోంది. ఈమెకు బెంగళూరులో రూ. 10 కోట్ల విలువ చేసే ఓ బంగ్లా తో పాటు ఖరీదైన రెండు కార్లు ఉన్నాయట.