Actor Vijay Thalapathy Biography : బాత్రూం కూడా లేని విజయ్.. ఇంత పెద్ద హీరోగా ఎలా ఎదిగారు..?

అలాగే తన కూతురుకు వాళ్ల చెల్లె పేరు కలిసేలా దివ్య అనే పేరును పెట్టాడు.ఇక తను కూడా బ్యాడ్మింటన్ లో రానిస్తుంది...ఇక మొత్తనికైతే ఇన్ని రోజులు విజయ్ ని స్టార్ హీరో గా చూశాం, ఇప్పుడు పొలిటీషియన్ గా చూడబోతున్నాం...

Written By: Gopi, Updated On : February 2, 2024 9:43 pm
Follow us on

Vijay Dalapathy Biography : తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఇళయ దళపతి గా మంచి పేరు సంపాదించుకున్న విజయ్ గత కొన్ని రోజుల క్రితం నుంచే రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ వస్తున్నారు.ఇక 2026 లో తమిళనాడు లో శాసన సభ ఎన్నికలు ఉండటం తో తను వాటిని టార్గెట్ చేస్తూ ‘తమిళగ వెట్రీ కళిగం’ ఒక రాజకీయ పార్టీ నీ పెట్టాడు. ఇక దీనికోసమే ఆయన లియో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కొద్దిరోజులు ఓపిక పట్టండి మనకు మంచి రోజులు వస్తాయి మీ కోసం నేను ఏది చేయడానికైనా రెఢీ గా ఉన్నాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు…

ఇక ఇది ఇలా ఉంటే తను ఈరోజు ఒక సక్సెస్ ఫుల్ హీరోగా మాత్రమే మనకు కనిపిస్తున్నాడు. కానీ ఆయన సక్సెస్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది మాత్రం ఎవ్వరికి అవసరం లేదు. కానీ విజయ్ రాత్రి పగలు కష్ట పడి సక్సెస్ లను అందుకుంటు వచ్చాడు. నిజానికి విజయ్ వాళ్ళ నాన్న ఎస్ ఏ చంద్రశేఖర్ తమిళంలో మంచి దర్శకుడుగా పేరు సంపాదించుకున్నప్పటికి ఆయన కొడుకు అయిన విజయ్ కూడా సినిమాల్లోకి రావడానికి చాలా కష్టపడ్డాడు అనే విషయం చాలా మందికి తెలియదు…

ఇక విజయ్ వాళ్ల అమ్మ అయిన శోభ గాయని, వల్ల నాన్న ఎస్ ఎ చంద్రశేఖర్ దర్శకుడు అయినప్పటికీ వీళ్ల కెరియర్ మొదట్లో బాత్రూం కూడా లేని ఒక చిన్న ఇరుకు ఇంట్లో ఉండేవాళ్ళు. అమ్మ శోభ ఏమైనా కచేరి ప్రోగ్రాం చేస్తే వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది. చంద్రశేఖర్ డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు పెద్దగా సక్సెస్ లు అయితే రాలేదు. ఇక ఎప్పుడైతే విజయ్ కాంత్ ను హీరోగా పెట్టి ‘చట్టం ఒరు ఇరుట్టరై’ అనే సినిమా ఆ సూపర్ హిట్ అయింది. దాంతో అప్పటినుంచి ఎస్ ఎ చంద్రశేఖర్ కి తిరుగులేదనే చెప్పాలి. ఇంకా ఆ సినిమాని తెలుగులో చిరంజీవి ‘చట్టానికి కళ్ళు లేవు’ అనే పేరు తో రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

నిజానికి ఎస్ ఎ చంద్రశేఖర్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ, తన కొడుకు అయిన విజయ్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. విజయ్ ని ఒక మంచి డాక్టర్ ను చేయాలని అనుకున్నాడు. ఇక అలాగే విజయ్ కూడా తన చెల్లె అయిన విద్య అకాల మరణంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇక దాంతో డిప్రెషన్ నుంచి కోలుకున్న తర్వాత తను డాక్టర్ అవ్వాలని అనుకొని బాగా చదవడం మొదలుపెట్టాడు. ఇంటర్మీడియట్ దాకా వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు గానీ, సడన్ గా తను సినిమా ఇండస్ట్రీకి వస్తానని వాళ్ల నాన్న అయిన చంద్రశేఖర్ తో చెప్పాడు దానికి ఆయన ఒప్పుకోలేదు. ఇంట్లో నుంచి వెల్లిపోమని చంద్ర శేఖర్ తిట్టడం తో విజయ్ లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.ఇక రోజంతా వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు కలిసి సిటీ మొత్తం వెతికినా కూడా ఎక్కడ కనిపించలేదు.

ఇక చివరగా థియేటర్ లో చూద్దాం అని చంద్ర శేఖర్ థియేటర్ లో కెళ్ళి చూస్తే అక్కడ విజయ్ కూర్చుని సినిమా చూస్తున్నాడు. ఒకే షో ను పదేపదే చూస్తూ ఆ థియేటర్ లోనే కూర్చుని ఉండిపోయాడు. ఇక విజయ్ వినేలా లేడు అని అనుకొని చంద్రశేఖర్ విజయ్ తో నువ్వు ఇండస్ట్రీలోకి రావడానికి ఇంకా సమయం ఉంది. ముందైతే ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేయి దాని తర్వాత సినిమా ఇండస్ట్రీకి రా అని చెప్పడంతో, విజయ్ ఏదో ఒక డిగ్రీ ఎందుకు సినిమాతో సంబంధం ఉన్న ‘విజువల్ కమ్యూనికేషన్’ చేస్తాను అని అందులో చేరాడు. ఇక అది పూర్తయిన తర్వాత విజయ్ ఫోటో షూట్ చేసుకొని ఆ ఫోటోలని ప్రతి డైరెక్టర్ కి చూపిస్తూ నాతో ఒక సినిమా చేయండి అని డైరెక్టర్లను అడిగే వాడు. చంద్రశేఖర్ మాత్రం తను మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కాబట్టి తన కొడుకుని ఒక క్లాస్ నటుడిగా చూడాలని అనుకొని అప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న క్లాస్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్లి తన కొడుకుతో సినిమా చేయండి సగం డబ్బులు నేనే పెడతాను అని చెప్పినప్పటికీ వాళ్ళందరూ కూడా నీ కొడుకు హీరో కాదు కదా, ఓ చిన్న నటుడుగా కూడా పని చేయడు. బండ మొహం వేసుకొని వాడు ఒక్క ఎక్స్ప్రెషన్ అయిన పెట్టగలడా అంటూ అవహేళన చేశారు.

ఇక మొత్తానికైతే వీళ్లని నమ్ముకుంటే పనవదు అనుకొని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి 60 లక్షలు అప్పుగా తీసుకొని ‘నాలయ తీర్పు’ అనే సినిమా చేశారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో చాలా డబ్బులు నష్టపోయారు.ఇక దానికి తోడు గా ఈ సినిమా క్రిస్మస్ కానుక రిలీజ్ అవ్వడంతో సరిగ్గా క్రిస్మస్ రోజే ఈ సినిమాని మీడియా వాళ్ళు చీల్చి చెండడారు. విజయ్ కి యాక్టింగ్ రాదు, ఏం రాదు తండ్రి దర్శకుడు అయితే కొడుకు హీరో అయిపోవచ్చు అనుకోవడం మూర్ఖత్వం లాంటి మాటలు రాశారు. ఇక అది చూసిన విజయ్ మనస్తాపం తో తను వేసుకున్న కొత్త బట్టలు కూడా విడ్చేసి ఒక్కడే తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. ఇక అదే సమయంలో తన స్నేహితులు తనకు ధైర్యం చెప్పి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే గెలిచి చూపించాలి విజయ్ అంటూ చెప్పడంతో, విజయ్ మరొక సినిమాకి రెడీ అయ్యాడు. ఇక సెకండ్ సినిమాగా సెంధూర పాండి అనే సినిమా చేశాడు.

అయితే ఇంతకు ముందు ఎస్ ఏ చంద్రశేఖర్ విజయ్ కాంత్ కి ఒక సూపర్ హిట్ ఇచ్చాడు. దాంతో విజయ్ కాంత్ కి చంద్ర శేఖర్ కి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఇక వీళ్ళు తీయబోయే సినిమాలో ఆయన చేత ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేయించాడు. దాంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక వీళ్ళు కోల్పోయిన ఆస్తులను తిరిగి సంపాదించుకున్నారు. కానీ ప్రతిసారి విజయ్ కాంత్ లాంటి గెస్ట్ ఆపీరియన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు కదా కాబట్టి మనల్ని మనమే ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తో విజయ్ డాన్స్, యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చాలా కష్టపడి అవన్నీ నేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు అప్పటినుంచి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈయన సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ వీడేవడో డాన్స్ బానే చేస్తున్నాడు, ఫైట్లు కూడా బానే చేస్తున్నాడు అంటూ ప్రేక్షకులు అతని నెత్తిన పెట్టుకున్నారు. ఇక అప్పటినుంచి వరుసగా హిట్ సినిమాలు తీస్తూ వచ్చాడు. ఖుషి, గిల్లి, పోక్కిరి లాంటి సినిమాలు చేస్తూ మాస్ హీరోగా తమిళ ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లని అందుకుంటూ వచ్చాడు…

ఇక తన అభిమాని అయిన సంగీత ను పెళ్లి చేసుకున్నాడు.వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళబ్బాయి జేసన్ యూట్యూబ్ లో వీడియో జాకీగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అలాగే తన కూతురుకు వాళ్ల చెల్లె పేరు కలిసేలా దివ్య అనే పేరును పెట్టాడు.ఇక తను కూడా బ్యాడ్మింటన్ లో రానిస్తుంది…ఇక మొత్తనికైతే ఇన్ని రోజులు విజయ్ ని స్టార్ హీరో గా చూశాం, ఇప్పుడు పొలిటీషియన్ గా చూడబోతున్నాం…