Taapsee Pannu: తెలుగు తెర పై పూసిన సొట్టబుగ్గల మందారం ‘తాప్సీ’, హిందీ వెండితెరపై మెరిసిన తెల్లని జాబిల్లి ‘తాప్సీ’, స్క్రీన్ పై ఆమె కనిపిస్తే రంగుల తెర కూడా చిన్నబోతుంది, ‘ఝుమ్మంది నాదం’ అంటూ పరిచయమైనా, సౌందర్యపు జలపాతంలా తెలుగు నుండి తమిళంకి అటు నుండి హిందీకి పరవళ్లు తొక్కిన సొగసుల ప్రవాహం ఆమెది. అందుకే, ‘తాప్సీ పన్ను’ ప్రత్యేకం అయ్యింది.
ఆకర్షణీయమైన మేని ఛాయ ఉన్న ‘తాప్సీ పన్ను’ అందం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలని ఉందా ? అసలు, తన అందం కాపాడుకోవడం కోసం ‘తాప్సీ పన్ను’ ఏమి చేస్తోంది ? మరి, తన చర్మ సంరక్షణ కోసం తాప్సీ పాటించే బ్యూటీ సీక్రెట్స్ ఏమిటి ? అలాగే ఆమె ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఏమిటో చూద్దాం.

డైట్ :
‘తాప్సీ పన్ను’ లిమిటెడ్ నాన్ వెజిటేరియన్ డైట్ ను ఫాలో అవుతుంది. అలాగే ‘తాప్సీ’కి పప్పు అంటే చాలా ఇష్టం, తన భోజనంలో ఎప్పుడూ పప్పు ఉండేలా చూసుకుంటుంది. తన అందమైన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం కోసం, ఆమె ఎక్కువగా ఆకుకూరలు, పెరుగుతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంది.
‘తాప్సీ’ తన సుకుమారమైన చర్మం కోసం ఏమి చేస్తోంది అంటే :
‘తాప్సీ’ తన రొటీన్‌లో ముఖం, చర్మంతో పాటు మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ‘తాప్సీ’ బయట దొరికే మేకప్ రసాయనాలు, వివిధ మార్కెట్ ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో చర్మ సంరక్షణను ఇష్టపడుతుంది. మెయిన్ గా బేసన్ (Besan) ఫ్రెష్ క్రీమ్ తో తయారు చేసిన ప్యాక్ ను ‘తాప్సీ’ ఎక్కువగా తన ఫేస్ కి అప్లై చేస్తుంది. ఈ ప్యాక్ స్క్రబ్ లాగా బాగా పనిచేస్తుందని ‘తాప్సీ’ అందానికే ఇదే మెయిన్ సీక్రెట్ అని ఆమె చెబుతుంది.

‘తాప్సీ’ ఈ ప్యాక్ ను ఎలా తయారు చేస్తోంది అంటే ?
ముందుగా ఆమె ఒక శుభ్రమైన గ్లాస్ బౌల్ తీసుకుని.. అందులో ఒక టేబుల్ స్పూన్ బేసన్, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతుంది. ఆ మిశ్రమాన్ని సన్నని పేస్ట్‌తో కాకుండా మందపాటి పేస్ట్ లాగా తయారు చేసి ‘తాప్సీ’ దాన్ని ఉపయోగిస్తోంది.

‘తాప్సీ’ అందాన్ని రెట్టింపు చేసింది ఇదే !
‘తాప్సీ’ ఈ ప్యాక్ రెసిపీని క్రమం తప్పకుండా వాడుతుంది. బేసన్, పాలు, తేనె, నిమ్మకాయ మిశ్రమాన్ని తయారు చేసి, మునుపటి పద్ధతిని అనుసరించి ముఖమంతా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ‘తాప్సీ’ దాన్ని తొలగిస్తోందట. అయితే, అది తీసేటప్పుడు సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలని చెబుతుంది. . తన ముఖంలో మెరుపును త్వరగా తీసుకురావడానికి ‘తాప్సీ’ ఇది పాటిస్తోందట.

సమ్మర్ లో ‘తాప్సీ’ తన చర్మం కోసం పాటించే బెస్ట్ బ్యూటీ టిప్ :
ముందుగా ఒక మీడియం సైజులో టమాటో లేదా పండిన బొప్పాయి గుజ్జును తయారు చేసుకోమంటుంది ‘తాప్సీ’. అలా తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి బాగా పట్టించి.. కాసేపయ్యాక సాధారణ నీళ్లతో కడుక్కుంటే.. తాప్సీ’ తన ముఖం లాగే త్వరగా మెరుస్తుందని చెబుతుంది.

చర్మ వ్యాయామాలతో పాటు, ‘తాప్సీ’ ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం, అలాగే పుష్కలంగా నీరు తీసుకుంటారు. బాగా తినడం, ప్రతిరోజూ పని చేయడం సంతోషంగా ఉండటమే తాను ఆరోగ్యంగా ఉండటానికి కీలకం అని కూడా ‘తాప్సీ’ చెబుతుంది. మరి ‘తాప్సీ’లా మీరు కూడా పాటించి.. మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.
Also Read:Liger Movie: లైగర్ మూవీలో అసలు సీక్రెట్ లీక్.. అందుకే ఆ ట్యాగ్‌లైన్ పెట్టారన్నమాట..!