Naina Ganguly: వర్మలో ఈ మధ్య బాగా పైత్యం ముదిరిపోయింది. వర్మలో కోరికలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అమ్మాయిలతో సరదాలను ఆస్వాదిస్తూ ముందుకు పోతున్నాడు. అసలు ఆర్జీవీ అనే వింత జీవికి ఏమైంది? గతంలో వర్మ తన మాటలతో రెచ్చిపోయేవాడు. కానీ ఈ మధ్య చేష్టలతో మితిమీరిపోతున్నాడు. వర్మ చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

ఎదురుగా అమ్మాయి కనిపిస్తే.. ఆయన ప్రవర్తన మారిపోతుంది. అయితే, కూతురు వయసున్న వారితో కూడా వర్మ తన పైత్యాన్ని చూపించడం ఏ మాత్రం సమంజసం కాదని నెటిజన్లు కామెంట్స్ చేసుకోవడమే తప్ప, వర్మ మాత్రం రోజురోజుకు విపరీత ధోరణినే కనబరుస్తున్నాడు. ఇటీవల ఆర్జీవీ బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన పార్టీకి పలువురు సెలబ్రిటీలు సహా.. మా ఇష్టం మూవీ హీరోయిన్ నైనా గంగూలీ అతిథులుగా వచ్చారు.
Also Read: Taapsee Pannu: ‘తాప్సీ పన్ను’ గ్లామర్ కి కారణం ఈ బ్యూటీ సీక్రెట్సే !
ఇక తన బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేసిన వర్మ ఓ చేతిలో మందుగ్లాసు, మరో చేతితో నైనాను పట్టుకున్నాడు. నైనా గంగూలీ హ్యాపీ బర్త్‌డే అంటూ వర్మ బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి ఈ భామ నిజంగా ఇష్టపడి ముద్దు పెట్టిందా ? లేక ఈ వివాదాల వర్మ తనకు ఛాన్స్ లు ఇస్తాడనే ఆశతో కాంప్రమైజ్ అయిందా ?
మొత్తానికి వర్మ పనులకు జనాలకు అసహ్యమేస్తోంది. అయినా మియా మాల్కోవా దగ్గర నుంచి మధ్యలో శ్రీ రాపాక, ఇప్పుడు నైనా గంగూలీ, అప్సరా రాణి… ఇలా వర్మ దిక్కుమాలిన సినిమాల్లో కనిపించి కనుమరుగై పోయిన తారలు ఎందరో ఉన్నారు. అయినా కొత్త భామలు మాత్రం ఇంకా వర్మనే నమ్మడం నిజంగా విచిత్రమే.

మరి వర్మ.. బూతు వర్మగానే మిగిలిపోతాడా ? లేక మళ్ళీ తనలోని ఫిల్మ్ మేకర్ ను నిద్ర లేపుతాడా ? అనేది చూడాలి. ప్రస్తుతం ఈ ముద్దు వీడియోని చూసి వర్మను అడ్డమైన తిట్లు తిడుతూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ‘వర్మ నీ ఏజ్, గేజ్ మర్చిపోయావా?’ అంటూ ఒకరు, నీ కామ పిచ్చికి లేదు పరిమితి అంటూ మరొకరు’ ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఐతే కొంతమంది మాత్రం వర్మకి సపోర్ట్ చేస్తూ ఉండటం విశేషం. వాళ్లిద్దరూ ఇష్టపడితే తప్పు ఏముంది ? అంటూ మరికొందరు అంటున్నారు.
Also Read:Chiranjeevi- Puri Jagannadh: అందుకే పూరిని నటుడిగా పరిచయం చేస్తున్నాం – మెగాస్టార్