T20 World Cup 2024 : ఇండియన్ టీమ్ లో యంగ్ ప్లేయర్ల పాత్రే కీలకం కానుందా..?

ఇండియన్ టీమ్ ప్లేయర్లు అందరు మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ అందరికీ ఆడే అవకాశం అయితే రాదు. కాబట్టి అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ల టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు.

Written By: NARESH, Updated On : January 19, 2024 1:07 pm
Follow us on

T20 World Cup 2024 : ప్రస్తుతం ఇండియన్ టీం ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఇండియన్ టీం లో ఉన్న యంగ్ ప్లేయర్లు అందరు ఒక్కొక్కరు వాళ్ల ప్రతిభ చూపించుకుంటు ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. ఇక ఏ దేశంలో లేని విధంగా ఇండియన్ టీం లో చాలామంది యంగ్ ప్లేయర్లు ఉన్నారు.

ఇక ఇప్పుడున్న ప్లేయర్లతోనే ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా ఇండియన్ టీమ్ క్రికెట్ ఆడుతూ నెంబర్ 1 స్థానం లో కొనసాగేంత సత్తా ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఇక ఇప్పుడున్న టీమ్ సూపర్ గా ఉన్నప్పటికీ ‘అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉంది’ అన్నట్టుగా ఇప్పుడు ఇండియన్ టీమ్ పరిస్థితి తయారైంది. ద్వై పాక్షిక సిరీస్ లను గెలుస్తూ వస్తున్న ఇండియన్ టీమ్ ఐసీసీ నిర్వహించే ట్రోఫీ లను మాత్రం కొట్టలేకపోతుంది.

2013లో ధోని ఉన్నప్పుడు వచ్చిన కప్పులు తప్ప ఇప్పటివరకు ఒక్క ఐసిసి ట్రోఫీ కూడా ఇండియన్ టీమ్ కొట్టలేకపోయింది. దాంతో ఇండియన్ టీమ్ కి ఐసిసి ట్రోఫీ అనేది పెద్ద శాపంగా మారింది. అందువల్ల ఇప్పుడు టి20 వరల్డ్ కప్ గెలుచుకొని మరోసారి ఇండియా ఇజ్ బ్యాక్ అనేలా సత్తా చాటాలని చూస్తుంది. దాని కోసమే ఇప్పుడు ప్లేయర్లందరికీ అగ్ని పరీక్ష పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరెవరు టీం లో సెలెక్ట్ అవ్వాలి అనేది ఐపిఎల్ లో ఆడే ఆట తీరును బట్టి ఉంటుందంటూ బిసిసిఐ పరోక్షంగా తెలియజేస్తుంది…

అయితే ఇండియన్ టీమ్ ప్లేయర్లు అందరు మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ అందరికీ ఆడే అవకాశం అయితే రాదు. కాబట్టి అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ల టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన ఆఫ్గనిస్తాన్ సిరీస్ లో రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్ లోకి వచ్చాడు. ముఖ్యంగా మూడోవ టి20 మ్యాచ్ లో తన సత్తా చూపించుకుంటూ భారీ సెంచరీని సాధించడమే కాకుండా కెప్టెన్ గా కూడా తన సత్తా చాటుకుంటూ మళ్ళీ తను ఫామ్ లోకి వచ్చాడు అని నిరూపించుకున్నాడు… ఇక ఇప్పుడు ఇండియన్ టీమ్ ని ఓడించే టీమ్ ఏది అని ప్రపంచ దేశాల క్రికెట్ టీమ్ ల మధ్య చర్చ మొదలైంది…