SA vs NED: టీ20 వరల్డ్ కప్ లో ఏది పసికూన కాదని అర్థమైంది. ఏకంగా ఇండియాను ఓడించిన బలమైన సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ టీం ఓడించి పెను సంచలనం సృష్టించింది. నెదర్లాండ్స్ పై గెలిస్తే చాలు సెమీస్ చేరే సువర్ణావకాశం ఉన్న దక్షిణాఫ్రికాకు ఈ ఫలితం గట్టి షాక్ ఇచ్చింది. షాక్ఇవ్వడమే కాదు.. సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ తోపాటు సెమీస్ చేరేది. కానీ ఓడిపోయి ఇప్పుడు పాకిస్తాన్ కు ఊపిరి పోసింది. నెదర్లాండ్స్ గెలిచి పాకిస్తాన్ కు సెమీస్ చేరే గొప్ప ఛాన్స్ ఇచ్చింది. ఈరోజు బంగ్లాదేశ్ ను ఓడిస్తే చాలు నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది. బంగ్లా దేశ్ గెలిచినా కూడా సెమీస్ చేరుతుంది. సో ఈ ఇద్దరి ఫైట్ మస్త్ మజా రానుంది. ఫైనల్ లో పాకిస్తాన్, ఇండియా తలపడాలన్న అభిమానుల ఆకాంక్షను సౌతాఫ్రికా ఓడి ఛాన్స్ ఇచ్చినట్టైంది.

ఇక సౌతాఫ్రికాకు 1992 వరల్డ్ కప్ నుంచి ఇదే కథ. నాడు వర్షం పడి గెలవాల్సిన సౌతాఫ్రికా ఓడిపోయింది. 1 బంతికి 22 పరుగులు చేయాలని డక్ వర్త్ లూయిస్ ప్రకారం నిర్ణయించి సౌతాఫ్రికాకు 1992లోనే కప్ అందకుండా అయ్యింది. ఈసారి కూడా అదే కథ పునరావృతమైంది.
సౌతాఫ్రికా ఓటమితో గ్రూప్ 2లో సెమీస్ రేసు పూర్తిగా మారిపోయింది. నెదర్లాండ్ గెలిచి మార్చేసింది. నిజానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలు ఉండేవి కావు. కానీ సౌతాఫ్రికా ఓడిపోవడంతో ఈ రెండూ రేసులోకి వచ్చాయి. పాక్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారిదే సెమీస్ బెర్త్. వర్షం వల్ల వచ్చి ఆగినా బాగా రన్ రేట్ ఉన్న పాకిస్తాన్ కే విజయావకాశాలు ఉంటాయి.
గ్రూప్ 2ను ఇలా ఆసక్తికరంగా మార్చేసిన ఘనత ఖచ్చితంగా నెదర్లాండ్ ఘనతనే. ఇక గ్రూప్ 1లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ లు మెరుగైన రన్ రేట్ కారణంగా సెమీస్ చేరారు. ఆతిథ్య ఆస్ట్రేలియా రన్ రేట్ లేకపోవడంతో ఓడిపోయింది. నిన్న శ్రీలంక చేతిలో ఓడిపోయింటే ఇంగ్లండ్ కూడా ఇలానే నిష్క్రమించేది.కానీ గెలిచి నిలిచింది. ఇప్పుడు గ్రూప్ 2 సెమీస్ బెర్త్ లు నేడు తేలనున్నాయి. గ్రూప్ 2 నుంచి భారత్ సెమీస్ చేరగా.. ఈరోజు విజేతతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఎవరో ఒకరు సెమీస్ చేరుతారు.
సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో నెగ్గింది. 159 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసి ఓడింది. దీంతో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. బ్యాట్స్ మెన్ వైఫల్యం వల్లే సౌతాఫ్రికా ఈ మ్యాచ్లో ఓడింది.