Bollywood: సాధారణంగా ఏ హీరోయిన్ అయినా హోటల్ లో రూం తీసుకుంటే ఏం చేస్తారు..? లగేజీ పక్కన పడేసి.. కాస్త రిలాక్స్ అవుతారు.. ఆ తరువాత సినిమా షూటింగ్ ఉంటే అందుకు సంబంధించిన రియార్సల్ చేస్తారు.. లేదా టీవీ, మొబైల్ తో కాలక్షేపం చేస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటి మాత్రం రూమ్ లోకి వెళ్లగానే ఇంకోపని చేస్తుందట. ముందు గోడలను పరీక్షిస్తుందట. ఆ తరువాత బాత్రూంను చెక్ చేస్తుందట. అన్నీ సవ్యంగా ఉన్నాయని అనుకున్న తరువాతే.. రిలాక్స్ అవుతుందట. హోటల్ రూంలో ఇంత తతంగం నడిపించాల్సిన అవసరం ఏముంది..? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..?

బాలీవుడ్ నటి దియా మిర్జా గురించి తెలియని వారుండరు. అమాయకమైన ఫేస్ తో ఆకట్టుకునే ఈ అమ్మడు బీ టౌన్ స్టార్ హీరోయిన్. 1999లో ‘రెహనా హే తేరే దిల్ మేన్’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత స్టార్ హీరోలందరి పక్కన నటించిన ఈ భామకు 40 ఏళ్ల వయసు వచ్చినా కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తోంది. ఇటీవల తెలుగులో నాగార్జున పక్కన ‘ఘోస్ట్’ సినిమాలో అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. హోటల్ రూంలోకి వెళ్లి న తరువాత అన్నీ పరిశీలించాకే మిగతా పనులు చేస్తుందట.
దియా మిర్జా ఎక్కడైనా హోటల్ లో దిగాల్సి వచ్చినప్పుడు ముందుగా గోడలవైపు ఎవరైనా కెమెరాలు అమర్చారా..? అని చూస్తుందట. అలాగే బాత్రూంలోకి వెళ్లి కూడా సీక్రెట్ కెమెరాలు ఏమైనా ఉన్నాయా..? అని పరిశీలిస్తుందట. అంతేకాకుండా హోటల్ లో తాను తీసుకున్న రూం నంబర్ ఎవరికీ చెప్పదట. తన సెక్యూరిటీ కోసమే ఏ రూంలోకి వెళ్లినా చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోందీ భామ. ఓ సందర్భంగా ఆమె నెట్టింట్లో పెట్టిన మెసేజ్ కు ఇప్పుడు పలు కామెంట్లు వస్తున్నాయి.
గతంలో హోటల్ గదిలో కొందరు సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళలకు సంబంధించిన వీడియోలను నెట్లో పెట్టారు. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ కెమెరాలు పెట్టి వారు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డు చేశారు. ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి దియా మిర్జీ పలు జాగ్రత్తలు తీసుకుంటుందట. అయితే ప్రతీ ఒక్కరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఓకే.. కానీ అందరూ ఇలా పాటిస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.