Amardeep – Surekhavani : బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ చౌదరి హీరోగా సుప్రీత హీరోయిన్ గా ఓ మూవీ మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా నటి సురేఖ వాణి కూతురు సుప్రీతకు ఇది డెబ్యూ మూవీ. అమర్ గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. సీరియల్ నటుడిగా మంచి గుర్తింపు ఉంది. హీరోగా తొలిసారి వెండితెరపై మెరవనున్నాడు.
అయితే సుప్రీత తల్లి సురేఖ వాణి, అమర్ దీప్ మధ్య రిలేషన్ ఉందట. ఎవరికీ తెలియని ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ టాక్ కి గెస్ట్ గా వెళ్లిన అమర్ దీప్… సురేఖ వాణి తో తనకున్న బంధం ఏమిటో బయటపెట్టాడు. జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోలో అమర్ దీప్, సుప్రీత పాల్గొన్నారు. ఈ క్రమంలో అమర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అమర్ దీప్ కి సురేఖ వాణి బంధువులు అవుతారట. సురేఖ వరుసకు అక్క అవుతుందట. తాను సుప్రీతకు వరసకు మేనమామ అవుతానని అమర్ చెప్పాడు. దాంతో హోస్ట్ రీతూ .. అమర్ ని ఒక్కసారి ప్రేమగా మామయ్య అని పిలవమని సుప్రీతతో చెప్తుంది. దీంతో సుప్రీత స్వీట్ గా మామయ్యా… అని పిలిచింది. అమర్ తెగ సిగ్గుపడిపోయాడు. తన సినిమాలో సుప్రీతని హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఆ పాత్రకు సుప్రీత బాగా సెట్ అవుతుందని అమర్ చెప్పాడు.
ఈ సినిమా వలన తన కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయని అమర్ అన్నాడు. ఇక సురేఖ వాణి ఎప్పటినుంచో తన కూతురు సుప్రీతని హీరోయిన్ ని చేయాలని ప్రయత్నాలు చేసింది. మొత్తానికి అమర్ సినిమాలో సుప్రీతకు అవకాశం రావడంతో ఆమె కల నెరవేరింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుప్రీతకు ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. మరోవైపు అమర్ దీప్ కి కూడా ఈ చిత్ర విజయం చాలా అవసరం. హీరోగా పరిశ్రమలో నిలదొక్కుకునే వీలు దొరుకుతుంది.