Revanth – Chandrababu : మనదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే లంచాలు తీసుకోవడమనేది నేరం. కానీ వాటిని తీసుకోకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయలేరు. అలాంటివారిని పట్టుకునేందుకు ఏసీబీ లాంటి వ్యవస్థలున్నాయి. మరి లంచాలు తీసుకునే రాజకీయ నాయకులను పట్టుకునేందుకు ఎలాంటి వ్యవస్థలూ మన దేశంలో లేవు. అందుకే రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. అడ్డగోలుగా సంపాదిస్తుంటారు. వ్యవస్థలను తమ చేతుల్లో పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసులో రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎదుర్కొంటున్నది కూడా అలాంటి కేసే. ఆమధ్య పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఎదుర్కొన్న ఆరోపణలు కూడా అలాంటివే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో ఒకరకంగా రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలినట్టయింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసులో కీలక తీర్పు ప్రకటించింది. దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కేసులో ఇమ్మ్యు నిటీ కల్పిస్తూ గతంలో మెజారిటీ న్యాయవాదులు తీర్పు ఇచ్చారు. అయితే తీర్పును చంద్ర చూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కొట్టేసింది.”శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. అలాంటివారు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలి. అంతేతప్ప లంచం తీసుకొని భారత ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేయకూడదని” సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. “ప్రజా ప్రతినిధి లంచం ఎలా తీసుకుంటారు? అలా లంచం తీసుకోవడానికేనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయింది? లంచం తీసుకొని శాసనసభ లేదా లోక్ సభ లో మాట్లాడటం సరైనది కాదు. అలాంటి తాయిలాలకు అలవాటు పడి ఓటు వేయడం సరైన చర్య కాదని” సుప్రీంకోర్టు ధర్మాసనం లోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎం ఎం సుందరిష్, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రా పేర్కొన్నారు.
గతంలో ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారని ఆరోపణలపై ఎమ్మెల్యేకు మినహాయింపు ఇస్తూ పివి నరసింహారావు కేసులో అప్పట్లో కోర్టు ఇచ్చిన తీర్పు విస్తృత పరిణామాలను కలిగి ఉందని డివై చంద్ర చూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే దీనిని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. శాసన విధులు నిర్వర్తించేందుకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మినహాయింపు ఎందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పీవీ నరసింహారావు కేసులో అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 105/194 కు విరుద్ధంగా ఉందని చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం ప్రకటించింది. శాసన అధికారాలను కచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తుపెట్టుకోవాలని సూచించింది. అధికారం అంటే అడ్డగోలుగా వ్యవహరించడం కాదని.. అలాంటి అధికారాలు చట్టసభ కూడా ఉంటాయని స్పష్టం చేసింది.105/194 అధికరణ సభ్యులకు విచ్చలవిడి వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అవినీతి అనేది రాచ పుండని.. శాసనసభ్యులు లంచం తీసుకోవడం పార్లమెంటరీ పనితీరును.. ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన తీర్పు రాజ్యసభ కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే.. అది కూడా అవినీతి నిరోధక చట్టం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Supreme court shocked revanth and chandrababu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com