Animal : మన దేశ జాతీయ జంతువు గురించి మనందరికీ తెలుసు. ఇది వేగానికి, చురుకుదనానికి చిహ్నం మాత్రమే కాదు, అద్భుతంగా వేటాడుతుంది కూడా. అయితే మన పొరుగు దేశం పాకిస్థాన్ జాతీయ జంతువు ఏది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మన చుట్టూ ఉన్న విషయాల గురించి మనకు సాధారణ సమాచారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. మన పొరుగు దేశం పాకిస్థాన్ జాతీయ జంతువు ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మొదట్లో సమాధానం చెప్పడం కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే ఇది అందరికీ తెలియని ప్రశ్న. కానీ ఈ జంతువు గురించి ఓ ఆసక్తికరమైన విషయం కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.
పాకిస్తాన్ జాతీయ జంతువు మేక. కానీ అది సాధారణ మేక కాదు. దీనిని మార్ఖోర్ అంటారు. మార్ఖోర్ ఒక ప్రత్యేకమైన, శక్తివంతమైన పర్వత మేక, ఇది హిమాలయాలు, చుట్టుపక్కల కొండ ప్రాంతాలలో కనిపిస్తుంది. వంగిన కొమ్ములు, బలమైన శరీరాకృతి ద్వారా ఫేమస్ అయింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జీవికి అతి పెద్ద శత్రువు పాములట. ఇక మార్ఖోర్ మేక బలానికి ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా పాములతో పోరాడే సామర్థ్యానికి మరింత ఫేమస్ అయింది. ఈ మేక పాములను కనిపెట్టి వాటిని నమిలి పారేస్తుంది. ఈ అద్వితీయ గుణాన్ని చూసి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మార్ఖోర్ మేకను గుర్తుగా పెట్టుకుంది.
మార్ఖోర్ అనే పదం పాష్టో భాష నుంచి వచ్చింది. దీని అర్థం “పాము-తినేది” లేదా “పామును చంపేది అని”. జానపద కథల ప్రకారం, మార్ఖోర్ తన శక్తివంతమైన కొమ్ములను ఉపయోగించి పాములను చంపుతుంది. వాటిని తింటుంది. ఈ ప్రత్యేక లక్షణం దానిని శక్తివంతమైన, సంకేత జంతువుగా చేస్తుంది.
మార్ఖోర్ మేక గురించి మరొక నమ్మకం ఏమిటంటే, దాని నోటి నుంచి వచ్చే శ్లేష్మం పాముకాటు నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. మార్ఖోర్‌కు అలాంటి ప్రత్యేక శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. ఇది పాముల నుంచి రక్షించడమే కాకుండా వాటిని చంపడం ద్వారా తనను తాను సురక్షితంగా ఉంచుతుంది. ఈ మేక చాలా శక్తివంతమైనది. మార్ఖోర్ ఎక్కడ నివసించినా, అక్కడ పాములు ఉనికి కూడా ఉండదు. మార్ఖోర్ దాని శక్తివంతమైన కాళ్ళతో పాములను చంపుతుంది. దీని కారణంగా ఇది పాములకు అతిపెద్ద శత్రువుగా ఉంటుంది. ఈ విశిష్ట ప్రవర్తన కారణంగా దీనికి ప్రత్యేక గౌరవం లభించింది. ఇది పాకిస్తాన్ జాతీయ జంతువుగా కొనసాగుతుంది.
మార్ఖోర్ మేక నిజంగా అద్భుతమైన, శక్తివంతమైన జంతువు. ఇది 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. దాని శరీరం ప్రత్యేకతలో ముఖ్యమైనది దాని దట్టమైన గడ్డం. ఇది దాని దవడ నుంచి కడుపు దిగువ వరకు విస్తరించి ఉంటుంది. ఈ మేక ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, టర్కిస్తాన్ పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది, ఇక్కడ వారు 2,000 నుంచి 11,800 అడుగుల ఎత్తు వరకు పర్వతాలలో నివసిస్తున్నారు.
అయినప్పటికీ, మార్కోర్ ఇప్పుడు అంతరించి పోతున్నట్లుగా చెబుతున్నారు. దాని మనుగడను కొనసాగించడానికి పరిరక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని ప్రత్యేక భౌతిక నిర్మాణం, జీవనశైలి కారణంగా ఇది పర్యావరణ సమతుల్యతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Not only mongoose but this animal is also enemy of snake it is also the national animal of the country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com