Krishna Health Update : సూపర్ స్టార్ కృష్ణకి నిన్న రాత్రి గుండెపోటు రావడం తో ఎమర్జెన్సీ చికిత్స నిమిత్తం ఆయనని హైదరాబాద్ లో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు.. క్రిటికల్ కండిషన్స్ లో కృష్ణ గారికి చికిత్స చేస్తున్నామని..హాస్పిటల్ తీసుకొచ్చిన వెంటనే 20 నిమిషాల్లోపు సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను కాపాడగలిగామని..ఆ తర్వాత ఐసీయూకి మార్చి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మీడియాకి ఒక రిపోర్ట్ ఇచ్చారు.

కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.. ఇది ఇలా ఉంటే.. కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మరో వార్త అభిమానుల్లో భయభ్రాంతులు కలిగించేలా చేస్తుంది.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా కృష్ణ శరీరంలో అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిల్ అవ్వడం మొదలైంది అట.
ప్రస్తుతం ఆయన పరిస్థితి మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది.. 24 గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి ఎలాంటిదో చెప్పలేని విధంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు.. ఈ మేరకు తాజా హెల్త్ బులిటెన్ భయం గొలుపుతోంది. కృష్ణ కుటుంబం మొత్తం ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉంది.. మహేష్ బాబు కూడా ఉదయం నుంచి హాస్పిటల్ వద్దనే ఉన్నాడు.. ఎక్కడ వినరాని మాట వినాల్సి వస్తుందో అని కుటుంబం మొత్తం విచారంగా ఉంది.. ఈ ఏడాది వరుసగా కృష్ణ కుటుంబంలో విషాదం అలుముకుంది. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు , కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణాలను జీర్ణించుకోలేక ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఘట్టమనేని కుటుంబానికి ఇప్పుడు కృష్ణ ఆరోగ్యం విషమంగా మారడంతో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోడానికి కూడా అందరికీ భయం వేస్తోంది.
జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ధృఢంగా నిలబడి సూపర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కృష్ణ.. ఇప్పుడు ఎదురైనా ఈ విపత్కర పరిస్థితిని కూడా విజయవంతంగా దాటుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకి రావాలని ఆ దేవుడికి ప్రార్థనలు చేద్దాం.