గూగుల్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సుందర్ పిచాయ్!

కరోనా ప్రపంచ దేశాల్లోని పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి ప్రజల జీవితాల్లో పెను మార్పులే తీసుకొచ్చింది. కరోనా ధాటికి లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఒకప్పుడు గొప్ప జీవితాన్ని అనుభవించిన వాళ్లు ప్రస్తుతం పేదరికంలో మగ్గిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పలు వ్యాపారాలు తీవ్రస్థాయిలో నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. Also Read : వామ్మో.. చైనా కరోనాతో ఇతర దేశాల ప్రజలను […]

Written By: Kusuma Aggunna, Updated On : September 29, 2020 7:36 am
Follow us on

కరోనా ప్రపంచ దేశాల్లోని పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి ప్రజల జీవితాల్లో పెను మార్పులే తీసుకొచ్చింది. కరోనా ధాటికి లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఒకప్పుడు గొప్ప జీవితాన్ని అనుభవించిన వాళ్లు ప్రస్తుతం పేదరికంలో మగ్గిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పలు వ్యాపారాలు తీవ్రస్థాయిలో నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

Also Read : వామ్మో.. చైనా కరోనాతో ఇతర దేశాల ప్రజలను మోసం చేసిందా..?

ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై మహమ్మారి ప్రభావం చూపింది. సాఫ్ట్ వేర్ రంగం మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా కరోనా ప్రభావాన్ని అంతో ఇంతో తట్టుకోగలిగింది. మెజారిటీ సాఫ్ట్ వేర్ కంపెనీలు డిసెంబర్ 31వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. ఇదే సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తీపికబురు చెప్పారు.

హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో భవిష్యత్తులో గూగుల్ ఉద్యోగులు పని చేయనున్నారని వెల్లడించారు. ఉద్యోగులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు పడుతున్నట్టు పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాము నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది ఉద్యోగులు కంపెనీకి వచ్చి ఉద్యోగం చేయడానికి సిద్ధపడుతున్నారని తెలిపారు.

అయితే ఉద్యోగులు ఆఫీస్ కు ప్రతిరోజూ వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. దీంతో సులభతరమైన పని విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. 100 శాతం రిమోట్ తరహాలో భవిష్యత్తులో పని విధానం ఉండబోతుందని పేర్కొన్నారు. హైబ్రిడ్ మోడల్స్‌పై దృష్టి పెట్టి ఉద్యోగులు కొన్ని రోజులకు ఒకసారి ఆఫీస్ కు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు.

Also Read : తాజా సర్వే : ఆడవాళ్లు ఆరోగ్యానికి హానికరమా.. ప్రయోజనమా.?