మెక్సికోలో దారుణం చోట చేసుకుంది. గ్వానజూల రాష్టంలోని జరల్ డెల్ ప్రోగ్రెస్సో నగరం లోని ఓ బార్ లో తుపాకీ చేత పట్టిన ఓ ఉన్మాది కాల్పులకు 11మంది ప్రాణాలు విడిచారు. మృతుల్లో 4గురు మహిళలు ఉన్నట్లు నగర పోలీస్ అధికారులు తెలిపారు. స్థానికంగా వుండే మాదక ద్రవ్య ముఠానే ఈ ఘాతుకానికి పట్టుపడినట్లు పోలీస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో జరిగే హింసాత్మక ఘటనలు ఎక్కువగా ఈ నగరంలోనే జరుగుతాయని పోలీస్ లు తెలిపారు. అయితే ఈ ముఠా ఏ లక్ష్యం కోసం దాడి చేసిందో తెలియాల్సి వుంది.
Also Read : వామ్మో.. చైనా కరోనాతో ఇతర దేశాల ప్రజలను మోసం చేసిందా..?