Snails on Gautama Buddhas Head: భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు అనుభవించిన గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసం అడవులకు వెళ్లాడు. కఠోర దీక్ష, బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాడు. అనంతరం దు:ఖంలో ఉన్న మనిషికి మార్గం చూపిన గొప్ప వ్యక్తి, పుట్టడం, పెరగడం, మరణించడం అనే క్రియల్లో మానవుడు తన దారేదో తెలియక తికమక పడుతున్నాడని చాటి చెప్పాడు. బుద్ధుడు తాను దేవుడినని చెప్పలేదు. కానీ నిజం కోసం మనుషులకు ఒక మార్గాన్ని అందించాడు. అది నా అనుభవంలోనుంచి పుట్టింది. దానిని అనుసరించి జీవిత సత్యాన్ని తెలుసుకోవాలని సూచించాడు.
Also Read: Gautama Buddha: బుద్ధుడి ధ్యానానికి నత్తలు కూడా ఆత్మార్పణం చేసుకున్నాయట?
అప్పటి వరకు రాజభోగాలను అనుభవిస్తున్న బుద్ధుడు వాటిని వదిలేసి అడవులకు వెళ్లాడు. ఆ సమయంలో ఆయన యోగిలా మారాడు. ఇందులో భాగంగానే ఆయన తలపై ఉన్న జుట్టును మొత్తం తీసేశాడని చరిత్ర చెబుతోంది. అయితే మనం బుద్ధుడి విగ్రహం చూసినప్పుడు ఆయన తలపై రింగుల్ లాగా కనిపిస్తాయి. ఇవి తలపై వెంట్రుకలనే అని అనుకుంటారు చాలా మంది. కానీ అవి నత్తలు. బుద్ధుడి తలపై అలంకరించినట్లుగా ఈ నత్తలు ఉంటాయి. అయితే ఇవి బుద్ధుడి తలపై ఎందుకు వచ్చాయి..? ఆ తరువాత బుద్ధుడి విగ్రహంలో వీటిని ఎందుకు తీర్చి దిద్దుతున్నారు..?
ఒకరోజు ఉదయం గౌతమ బుద్ధుడు ధ్యానం కోసం మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ సమయంలో ఓ చెట్టు కనిపించడంతో దాని కింద కూర్చొని ధ్యానం చేస్తాడు. అయితే ధ్యానంలో మునిగిన బుద్ధుడు సమయం గురించి మరిచిపోతాడు. కొంత సమయం గడిచిన తరువాత సూర్యకిరణాలు చెట్టు కొమ్మల మధ్య నుంచి వచ్చి బుద్ధుడి తలపై పడుతుంటాయి.
ఇంతలో అటువైపు ఓ నత్త వెళ్తుంది. బుద్ధుడి ధ్యానం చూసి ఆశ్చర్యపోతుంది. ఇంత ఎండలో బుద్ధుడి ధ్యానాన్ని చూసి ఆయనకు ఏదైనా సాయంచేయాలని అనుకుంటుంది. దీంతో ఆ నత్త మెల్లగా ప్రాకుతూ బుద్ధుని తలపైకి వెళ్తుంది. నత్త కిందిచర్మం చల్లగా ఉంటుంది. దీంతో బుద్దుని తలపైకి సూర్యకిరణాలు రాకుండా ఆపుతుంది. ఇలా మరికొన్ని నత్తలు బుద్ధుని తలపైకి వెళ్తాయి. అలా 108 నత్తలు బుద్ధుని తలపై సూర్యకిరణాలు పడకుండా అడ్డుగా ఉండి ధ్యానం చేయడానికి సాయం చేస్తాయి.
Also Read: ఈ రూపాయి మీ దగ్గర ఉంటే 2.5 లక్షలు మీవే.. ఎలా అంటే?
అయితే సూర్యుడి వేడిమి తట్టుకోలేక ఆ నత్తలు చనిపోతాయి. ఇంతలో బుద్ధుడు ధ్యానం నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ నత్తలు చూసిన బుద్ధుడు జరిగిన దానిని గ్రహిస్తాడు. అలా తన ధ్యానానికి సాయపడిన నత్తలు అమరవీరులుగా గుర్తించబడ్డాయి. వాటి త్యాగాలను గుర్తు చేసే విధంగా బుద్ధ విగ్రహాలపై వాటిని తీర్చి దిద్దుతున్నారు. ఇది బుద్దుడికి సాయం పడిన నత్తల కథ..