https://oktelugu.com/

Congress: కాంగ్రెస్ బలోపేతం.. టీఆర్ఎస్ కు ఆనందమా?

Congress: ఉమ్మడి ఆంధప్రదేశ్ లో కాంగ్రెస్ ఘనమైన చరిత్ర ఉంది. ఆపార్టీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాతి నుంచి కాంగ్రెస్ ప్రతిష్ట క్రమంగా కేంద్రంలో, రాష్ట్రంలో మసకబారుతూ వస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోగా.. తెలంగాణలోనూ దాదాపు అదే స్థితికి చేరుకుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉన్నప్పటికీ వరుసగా రెండుసార్లు ప్రతిపక్షానికే పరిమితమైంది. దీంతో ఆ పార్టీలోని నేతలంతా టీఆర్ఎస్ పార్టీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2021 / 11:34 AM IST
    Follow us on

    Congress: ఉమ్మడి ఆంధప్రదేశ్ లో కాంగ్రెస్ ఘనమైన చరిత్ర ఉంది. ఆపార్టీ హయాంలోనే ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాతి నుంచి కాంగ్రెస్ ప్రతిష్ట క్రమంగా కేంద్రంలో, రాష్ట్రంలో మసకబారుతూ వస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోగా.. తెలంగాణలోనూ దాదాపు అదే స్థితికి చేరుకుంది.

    TRS Congress

    తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉన్నప్పటికీ వరుసగా రెండుసార్లు ప్రతిపక్షానికే పరిమితమైంది. దీంతో ఆ పార్టీలోని నేతలంతా టీఆర్ఎస్ పార్టీలో జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీన పడుతూ వస్తోంది. వరుస ఎన్నికల్లో వరుస పరాజయాలు ఆపార్టీని ఇంకా దెబ్బతిస్తున్నాయి.

    మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నామంగా బీజేపీ మారుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిచ్చిన బీజేపీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ కేవలం నాగార్జున్ సాగర్ బై ఎలక్షన్ లో డిపాజిట్ దక్కించుకొని పరువు నిలుపుకుంది. మిగిలిన ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు ఇటీవలీ కాలంలో లేవనే చెప్పొచ్చు.

    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు అభ్యర్థే కరువయ్యారంటే ఆపార్టీ దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బల్మూరి వెంకట్ అనే విద్యార్థి నాయకుడి టికెట్ ఇవ్వగా పట్టుమరి 3వేల ఓట్లు రాలేదు. కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా చీలడంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైందని స్పష్టంగా అర్థమవుతోంది.

    తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సైతం బరిలో నిలుస్తోంది. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో ఆపార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టిన గెలువడం కష్టమే. అయినప్పటీకీ ఆ పార్టీ కొన్ని జిల్లాలో పోటీకి సై అంటోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బరిలో ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఖుషీ అవుతున్నారని సమాచారం.

    ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం ధృవీకరిస్తున్నారు. ఇటీవల స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తదిరతులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు స్థానిక నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చేవాడే కాదన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో పెట్టగానే ఆయనే స్వయంగా అందరికి ఫోన్లు చేస్తున్నాడని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేసీఆర్ స్థానిక సంస్థల నాయకుల విషయంలో దిగివస్తారన్నారు.

    Also Read: సై.. పార్లమెంట్ సాక్షిగా బీజేపీపై తొడగొట్టిన టీఆర్ఎస్.. ఇరికించేలా కొత్త విధానం

    కాంగ్రెస్ హయాంలో స్థానిక నేతలకు భారీగా నిధులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో పెట్టాక టీఆర్ఎస్ స్థానిక నేతలు ఆనందంగా ఉన్నారని తెలిపారు.

    టీఆర్ఎస్ ధీటుగా బీజేపీ ఎదుగున్న క్రమంలో కాంగ్రెస్ రేసులో రావడం టీఆర్ఎస్ కు కూడా కలిసి వస్తుందని ఆపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ కొద్దో గొప్పో పోటీ  ఇస్తుందా? లేదంటే యధావిధిగా ఓటమిని అంగీకరిస్తుందా? అనేది మాత్రం చూడాల్సిందే..!

    Also Read: కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ పక్కా వ్యూహం?