#WhatsAppDown : ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయి అంతా ఆగమాగమైంది. ఎట్టకేలకు రెండు గంటల తర్వాత ఈ వాట్సాప్ ను పునరుద్ధరించారు. వాట్సాప్ ఆగిపోవడంతో దాని మాతృసంస్థ మెటాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని కంపెనీ తెలిపింది. 12.30 గంటలకు ఆగిపోయిన వాట్సాప్ .. రెండు గంటల తర్వాత 2.30 తిరిగి పునరుద్ధరించారు.

కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ వాట్సాప్ సేవలు తిరిగి పనిచేయడం మొదలయ్యాయి. క్రమంగా అందరికీ మెసేజ్ లు వెళుతున్నట్టు యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అయితే అందరికీ సేవలు ఇంకా పూర్తి స్తాయిలో పనిచేయడం లేదని తెలుస్తోంది. దీనికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందట..
ప్రపంచవ్యాప్తంగా ‘వాట్సాప్’ రెండు గంటల కిందట.. ఆగిపోయింది. వాట్సాప్ లేనిదే సగటు మనిషి జీవితం నడవని పరిస్థితులను కళ్లారా వినియోగదారులు చూశారు. ఎదుటివారితో సమాచార పంపిణీ లేక ఉద్యోగుల పనులు ఆగిపోయాయి. మీడియా సమాచార బట్వాడా చేయలేకపోయింది. ప్రజలు తమ సన్నిహితులతో చాట్ చేయలేకపోయారు. వాట్పాప్ ఆగిపోవడంతో చాలా మంది పని కూడా ఆగిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోయింది. అన్ని కంపెనీలు, సంస్థల్లో వాట్సాప్ ద్వారానే పనులు సాగుతుంటాయి. మీడియాలోనూ వార్తలు చేరవేయడానికి వాట్సాప్ నే కీలకం. అలాంటి వాట్సాప్ ఆగిపోవడంతో సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయినట్టైంది.
ఎట్టకేలకు 2 గంటల తర్వాత వాట్సాప్ సేవలు పునరుద్ధరించడంతో హమ్మాయ్యా అంటూ అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సూర్య గ్రహణం రోజు వాట్సాప్ కు గ్రహణం పట్టిందని.. ఇప్పుడు వీడిపోయిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.