ఉచిత వైఫై కోసం కూతురు పేరును అమ్మేశారు.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో కంపెనీలు ప్రచారం కోసం కొత్త తరహా ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్విటర్లాండ్ లో ఒక కంపెనీ కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ట్విఫి అనే కంపెనీ తమ పేరు వచ్చేలా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పేరు పెడితే ఉచిత వై-ఫై కనెక్షన్ ఇస్తామని ప్రకటన చేసింది. ఇందుకు సమ్మతమైన వాళ్లు అమ్మాయి లేదా అబ్బాయి ఫోటోతో పాటు బర్త్ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని కంపెనీ […]

Written By: Navya, Updated On : October 18, 2020 8:35 pm
Follow us on

ఈ మధ్య కాలంలో కంపెనీలు ప్రచారం కోసం కొత్త తరహా ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్విటర్లాండ్ లో ఒక కంపెనీ కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ట్విఫి అనే కంపెనీ తమ పేరు వచ్చేలా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పేరు పెడితే ఉచిత వై-ఫై కనెక్షన్ ఇస్తామని ప్రకటన చేసింది. ఇందుకు సమ్మతమైన వాళ్లు అమ్మాయి లేదా అబ్బాయి ఫోటోతో పాటు బర్త్ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ట్విఫియా లేదా ట్విఫస్ అని పిల్లలకు పేర్లు పెట్టాలని సూచనలు చేసింది. అయితే ఈ ఆఫర్ చాలామందికి నచ్చకపోవడంతో ఎవరూ అందుకు అంగీకరించలేదు. అయితే స్థానిక సోషల్ మీడియాలో ఈ ప్రకటన మాత్రం తెగ వైరల్ అయింది. స్విట్జర్లాండ్ లో ఉంటున్న ఒక యువజంటను ఆ ప్రకటన ఎంతగానో ఆకర్షించింది. తమ కుమార్తెకు ట్విఫియా అని పేరు పెట్టడంతో పాటు యువజంట పాప బర్త్ సర్టిఫికెట్ ను కంపెనీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు.

ఆ యువజంట పాపకు ట్విఫియా ఎనే పేరును పెట్టడం గురించి స్పందిస్తూ ఫ్రీ ద్వారా ఆదా అయ్యే డబ్బును కూతురు పేరుతో బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని వెల్లడించారు. పెద్దైన తరువాత ఆ డబ్బు కూతురుకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ట్విఫియా అని పేరు పెట్టడం తమకు ఏ మాత్రం ఇష్టం లేదని అయితే డబ్బు ఆదా చేయవచ్చని ఈ పని చేశామని వాళ్లు వెల్లడించారు.

అయితే యువ జంట పేరు పెట్టడంతో సోషల్ మీడియాలో ఆ జంటపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత వైఫై కోసం కూతురు పేరును అమ్మేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్విఫి వ్యవస్థాపకుడు, సీఈవో ఫిలిప్ ఫోష్ మాట్లాడుతూ కొత్త జంటలకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని.. తమ కంపెనీ మూతబడినా పేరు పెట్టిన తల్లిదండ్రులకు ఫ్రీ వైఫై అందిస్తామని వెల్లడించారు.