https://oktelugu.com/

ప్రేక్షకులను పిచ్చోళ్లను చేస్తున్న నోయల్.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు ప్రేక్షకులను ఫూల్స్ చేస్తున్నారని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్ లో తమ రియల్ లైఫ్ కష్టాలను చెప్పుకున్న సంగతి తెలిసిందే. చాలామంది కంటెస్టెంట్లు తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పడిన కష్టాలను, తమ జీవితంలో ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారు. సింగర్ నోయల్ కూడా ఇతరుల్లా తన కష్టాలను చెప్పుకొచ్చారు. నోయల్ తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఇస్త్రీ, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 18, 2020 / 09:27 PM IST
    Follow us on

    బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు ప్రేక్షకులను ఫూల్స్ చేస్తున్నారని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్ లో తమ రియల్ లైఫ్ కష్టాలను చెప్పుకున్న సంగతి తెలిసిందే. చాలామంది కంటెస్టెంట్లు తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పడిన కష్టాలను, తమ జీవితంలో ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారు. సింగర్ నోయల్ కూడా ఇతరుల్లా తన కష్టాలను చెప్పుకొచ్చారు.

    నోయల్ తన తల్లిదండ్రుల గురించి చెబుతూ ఇస్త్రీ, మేస్త్రీ ప‌నులు చేస్తూ నాన్న డబ్బులు సంపాదించేవాడని, అమ్మ అందరి ఇళ్లలో పని చేసేదని అన్నారు. అయితే నోయల్ అబద్ధం చెప్పినా వికీపీడియా వాస్తవం బయటపెట్టింది. అందులో నోయల్ తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది. దీంతో ప్రేక్షకులను నోయల్ బకరాలను చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే నోయల్ అబద్ధం చెప్పాడో వికీపీడియాలో తప్పుగా పొందుపరిచారో తెలియాల్సి ఉంది.

    దీంతో నోయల్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం నోయల్ గురించి సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. రోజుకూలీ అని చెప్పి నోయల్ సింపతీ ఓట్లు పొందడానికి ప్రయత్నించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నోయల్ వైపు నుంచి స్పష్టత వస్తే మాత్రమే అసలు నిజం తెలిసే అవకాశం ఉంది. మరోవైపు నోయల్ ఇంట్లో సైలెంట్ గా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    కొన్ని రోజుల క్రితం గంగవ్వలా తనను పంపించండంటూ నోయల్ చేసిన కామెంట్లు సెన్సేషన్ అయ్యాయి. మరోవైపు నెటిజన్లలో చాలామంది నోయల్ సింపథీ గేమ్ ఆడుతున్నాడని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం