Singer Sunitha: సింగర్ సునీత గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ఇప్పుడు తెగ వినిపిస్తోంది. సునీత గర్భవతి అని మళ్ళీ పుకార్లు పుట్టించారు. సరోగసి ద్వారా పిల్లలను కనాలని సునీత నిర్ణయించుకుందని గతంలోనే రూమర్స్ వచ్చాయి. మళ్ళీ తాజాగా ఈ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ పుకార్లలో నిజం ఉందా అని ఆరా తీస్తే.. సునీత మాత్రం మళ్లీ తల్లి కావాలనే ఆలోచనలో ఉందట.

కాకపోతే, సరోగసి ద్వారానే పిల్లలను కనాలని ఆమె ప్లాన్ చేస్తోంది. సునీత రెండో భర్త రామ్ పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్. అందుకే డిజిటల్ లోకి సునీత కూడా ఎంటర్ కానుంది. సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది. అయితే, ఆ చిన్న చిత్రాల నిర్మాణ పరంపరను సునీత నేపథ్యంలో సాగుతుందని.. కథల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు అన్నీ ఆమె చూసుకుంటుందని తెలుస్తోంది.
Also Read: Mike Tyson: వైరల్ వీడియో: విసిగించిన అభిమానిని విమానంలో చితక్కొట్టిన మైక్ టైసన్
పైగా సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. సింగర్ గా ఎంతో పాపులారిటీ సాధించిన సునీత, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సునీతకు బుల్లితెర పై బోలెడు అభిమానులు ఉన్నారు, అందుకే సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తోంది. మొత్తానికి భర్త రామ్ వీరపనేని కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నాడు.

సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నిజానికి ఎన్నో ఏళ్ల పాటు సునీత ఒంటరి జీవితాన్ని గడిపింది. ఆ సమయంలో ఆమె చాల ఇబ్బందులు పడింది. ఎన్ని కష్టాలు పడినా సునీత మాత్రం ఎక్కడా నిరుత్సాహపడలేదు.
ఏది ఏమైనా సునీత గాత్రం ఎంతో కమ్మగా ఉంటుంది. ఆమె చీర కట్టు ఆమెలోని తెలుగుతనాన్ని ఆహ్లాదకరంగా మారుస్తోంది. ఇప్పటి హీరోయిన్స్ కంటే.. ఎంతో అందంగా కనిపించే సునీత ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read:Jr NTR: ఆ హీరో స్ఫూర్తితోనే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష..!
Recommended Videos:



[…] Janhvi Kapoor: స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఒక కొత్త సినిమా ‘జన గణ మన’ మొదలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు జాన్వీ దగ్గరకు వెళ్లాయి. అమ్మడు తాజాగా క్లారిటీ ఇచ్చింది. జాన్వీ మాటల్లోనే ‘పుకార్లను నమ్మకండి. నేనిప్పటివరకు ఏ తెలుగు సినిమాను ఓకే చేయలేదు. ఒకవేళ ఏదైనా సినిమాకు సంతకం చేస్తే తప్పకుండా చెప్తా’ అని తెలిపింది. […]
[…] Chiranjeevi Tweet: ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వస్తున్న ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమాలో ‘చిరు – చరణ్ పాత్ర’ల దగ్గర నుంచి దేవాలయాల నేపథ్యం వరకూ మహేష్ వాయిస్ ఓవర్ తోనే ఈ సినిమా నడుస్తోంది. అంటే.. ఆచార్యలో మహేష్ గొంతు చాలా కీలకం కాబోతుంది. అందుకే, తన సినిమా కోసం మహేష్ తన మనోహరమైన స్వరాన్ని ఇచ్చినందుకు మెగాస్టార్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. […]
[…] KGF 2 Collections: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి ‘కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ ఆ ఓపెనింగ్స్ కంటిన్యూ మాత్రం కావడం లేదు. […]