Vasireddy Padma: విజయవాడలో దివ్యాంగురాలైన యువతిపై గ్యాంగ్ రేప్ కు గురైన సంఘటన సంచలనం సృష్టించింది. దీనిపై మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మానసిక వికలాంగురాలనే సానుభూతి సైతం లేకుండా మానవ మృగాళ్లు రెచ్చిపోయి సామూహిక అత్యాచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో లైంగిక దాడులు పెరుగుతున్నాయి.
దీంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద పెద్దఎత్తున నినాదాలు చేశారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులుగా నేరాల సంఖ్య పెరుగుతున్నాప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంతోనే దురాగాతాలు చోటుచేసుకుంటున్నాయనే వాదనలు వస్తున్నాయి. మొత్తానికి ఏపీలో శాంతిభద్రతల సమస్య పెరిగిందని తెలుస్తోంది. అందుకే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలోరావణ రాజ్యం నడుస్తోందనే విమర్శలు సైతం వస్తున్నాయి.
Also Read: Minister KTR: కేటీఆర్.. ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా.. ఇలా అయితే ఎలా..?
రాష్ర్ట ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించాయి. నిందితులపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే్స్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అనర్థం జరిగిందని దుయ్యబడుతున్నారు. రాష్ట్రంలో పోలీసులు పని చేస్తున్నారా లేక పైరవీలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
రాష్ర్టమహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబాన్నిపరామర్శించేందుకు రాగా అడ్డుకున్నారు.ప్రతిపక్షనేత చంద్రబాబు వచ్చినా అనుమతించలేదు. ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తున్నారు. రాష్ట్రంలో దుర్మార్గుల దురాగాతాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే మహిళల భవిష్యత్ ఏమిటనే వాదనలు వస్తున్నాయి. మొత్తానికి సర్కారుతీరు ప్రశ్నార్థకంగా మారుతోంది.
Also Read:Vijayawada Crime: ఆడబిడ్డల మానానికి రక్షణేది? ఏపీ నడిబొడ్డున సామూహిక అత్యాచారం
Recommended Videos: