Mike Tyson: వైరల్ వీడియో: విసిగించిన అభిమానిని విమానంలో చితక్కొట్టిన మైక్ టైసన్

Mike Tyson: కొన్నిసార్లు అభిమానులు చేసే చేష్టలు సెలబ్రిటీలకు కోపాన్ని తెచ్చిపెడతాయి. అభిమానులు ఫన్ కోసమే చేసినా స్టార్లను అవి ఇబ్బంది పెడతాయి. తాజాగా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. దీంతో అతడు తాను ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడిపై దాడి చేశాడు. అసలు ఏం జరిగిందంటే.. ఈనెల 20న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్ టైస‌న్ జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కాడు. ఈ విమానంలో మైక్ టైసన్ […]

Written By: Mallesh, Updated On : April 22, 2022 4:53 pm
Follow us on

Mike Tyson: కొన్నిసార్లు అభిమానులు చేసే చేష్టలు సెలబ్రిటీలకు కోపాన్ని తెచ్చిపెడతాయి. అభిమానులు ఫన్ కోసమే చేసినా స్టార్లను అవి ఇబ్బంది పెడతాయి. తాజాగా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. దీంతో అతడు తాను ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడిపై దాడి చేశాడు.

Mike Tyson

అసలు ఏం జరిగిందంటే.. ఈనెల 20న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్ టైస‌న్ జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కాడు. ఈ విమానంలో మైక్ టైసన్ వెనుక సీటులో కూర్చున్న యువకుడు పెద్ద వాగుడుకాయ. దీంతో అతడు నాన్‌స్టాప్‌గా మాటలు చెప్తూనే ఉన్నాడు. తనకు కొంచెం అలసటగా ఉందని.. తనతో మాట్లాడొద్దంటూ సదరు యువకుడికి మైక్ టైసన్ స్పష్టంగా చెప్పాడు.

Also Read: Vasireddy Padma: వియవాడ గ్యాంగ్ రేప్ పరామర్శకు వచ్చిన వాసిరెడ్డి పద్మకు సాకిచ్చిన మహిళలు

కానీ ఆ యువకుడు వినిపించుకోకుండా నస పెడుతూనే ఉన్నాడు. పనిలో పనిగా టైసన్‌పై ఫన్నీ కామెంట్లు కూడా చేశాడు. టైసన్‌ను ఉద్దేశించి బ్యాడెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ప్లానెట్ అని మాట్లాడాడు. మొదట్లో ఆ యువకుడి కామెంట్లను టైసన్ పట్టించుకోలేదు. కానీ యువకుడి వాగుడు ఎక్కువ కావడంతో టైసన్ సహించలేకపోయాడు.

Mike Tyson

దయచేసి న్యూసెన్స్ చేయవద్దని ఆ యువకుడిని మైక్ టైసన్ కోరాడు. అయినా యువకుడు తన ధోరణి మార్చుకోలేదు. దీంతో టైసన్‌కు కోపం కట్టలు తెచ్చుకోవడంతో ఆ యువకుడి వ‌ద్ద‌కు వెళ్లి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో సదరు యువకుడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైర‌ల్ అవుతోంది.

Also Read:Alia Bhatt: కత్రినా ఇంట్లో ఆలియా భట్ కాపురం !

Tags