https://oktelugu.com/

రథ సప్తమి అంటే ఏమిటి… రథసప్తమి విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..!

సూర్యుడు మనకు కనిపించే దేవుడు. ఆ సూర్యభగవానుడి వల్ల ఎన్నో జీవరాసులు భూమిపై నివసిస్తున్నాయి. జీవరాశులకు ఇంతటి ప్రాణాధారమైన ఆ సూర్యభగవానుని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. లోక సంరక్షణకోసం ఆ సూర్యభగవానుడు రథం ఎక్కిన రోజును రథసప్తమి అని అంటారు.అయితే చాలామంది ఈ రథసప్తమిని ఆ సూర్యభగవానుడు జయంతి అని భావిస్తుంటారు. ఈ రథసప్తమి రోజు ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలి.సప్తానాం పూరణీ సప్తమీ అనగా ఒకటి నుంచి ఏడు స్థానాలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 19, 2021 / 08:00 AM IST
    Follow us on

    సూర్యుడు మనకు కనిపించే దేవుడు. ఆ సూర్యభగవానుడి వల్ల ఎన్నో జీవరాసులు భూమిపై నివసిస్తున్నాయి. జీవరాశులకు ఇంతటి ప్రాణాధారమైన ఆ సూర్యభగవానుని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. లోక సంరక్షణకోసం ఆ సూర్యభగవానుడు రథం ఎక్కిన రోజును రథసప్తమి అని అంటారు.అయితే చాలామంది ఈ రథసప్తమిని ఆ సూర్యభగవానుడు జయంతి అని భావిస్తుంటారు. ఈ రథసప్తమి రోజు ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలి.సప్తానాం పూరణీ సప్తమీ అనగా ఒకటి నుంచి ఏడు స్థానాలను గుర్తించేది సప్తమి కనుక దీనిని రథసప్తమి అంటారు.

    Also Read: తమిళనాడులో వింత దేవాలయం.. రంగులు మారే వినాయకుడు..?

    ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన ఉష్ట చైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్ని ఎక్కి విధులలోకి ప్రవేశించిన రోజు కావడంతో ఈ రోజుని రధసప్తమి అంటారు. సూర్యుడు ఎక్కిన రథం సర్వసాధారణమైన రథం కాదు. ఈ రథానికి ఒకటే చక్రం ఉంటుంది. అదేవిధంగా తొడల నుండి క్రిందభాగం లేని ‘అనూరుడు’ రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఎటువంటి నిలబడే ఆధారం లేని ఆకాశం లో పయనిస్తుంది.

    Also Read: నందీశ్వరుని కొమ్ముల మధ్యలో శివుని దర్శనం చేసుకోవడానికి గల కారణం ఇదే..!

    ఈ విధంగా రథంపై ప్రయాణించిన సూర్యుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఈ సూర్యుని రథానికి ఉన్న గుర్రాలను చందస్సులు అని పిలుస్తారు. ఈ సూర్యుడి రథాన్ని లాగడానికి ఏడు గుర్రాలు ఉన్నాయి అవి . గాయత్రి, 2. త్రిష్టుప్, 3. జగతి అనుష్టుప్, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్ ఈ ఏడు కుర్రాళ్లకు అలసట అనేది ఉండదు. నిరంతరం వాటి ప్రక్రియలను కొనసాగిస్తూనే ఉంటాయి. సూర్యుడు7 గుర్రాలు 7 రకాల కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి సూర్యకిరణాలలో ఏడు రంగులు ఉంటాయి. ఈ ఈ రథసప్తమి రోజున హిందువులు పెద్ద ఎత్తున సూర్యభగవానుడికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం