Shyam Singha Roy Telugu Teaser : స్త్రీ ఎవడికి దాసి కాదు.. ఆఖరుకు ఆ దేవుడికి కూడా.. అంటూ శ్యామ్ సింగరాయ్ మీసం మేలేసి అడ్డంగా నిలబడ్డాడు. ఆడవారిని అమానుషంగా చూసే వారికి ఆకృత్యాలను ఎదురించే హీరోగా నాని నిలబడ్డట్టు తెలుస్తోంది. ఒక పాత కాలపు అన్యాయాలు, అక్రమాలను ఈ సినిమాలో చూపించినట్టుగా తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ మొత్తం చూస్తే ఏదో ఉందనిపిస్తోంది. ఏదో ఒక అసృష్యత అంశాన్ని ఇందులో ఎలివేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

రాహుల్ సంక్రిత్యన్.. టాక్సివాలా, ది ఎండ్ లాంటి విలక్షణ చిత్రాలను అందించి హిట్ కొట్టిన దర్శకుడు. ఇప్పుడు తన మూడో ప్రయత్నంగా నాని హీరోగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ రూపొందింది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే కథను రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తగా కట్ చేశారు.
కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో అడిగే అండ లేదు.. కలబడ కండలేదని.. ఆడవారిని దాసిగా మార్చి వారిపై అత్యాచారాలు చేసే ముఠాను ఎదురించే వీరుడిగా శ్యామ్ సింగరాయ్ కనిపిస్తున్నట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ఇక ఒక పాత్ర శ్యామ్ సింగరాయ్ గా.. విదేశాల్లో ఒక అల్ట్రా ఫొటోగ్రాఫర్ గా రెండు భిన్నమైన పాత్రల్లో నాని నటించాడు. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లు. స్త్రీల సమస్యలను ప్రధానంగా చేసుకొని ఈ కథను రాసినట్టు తెలుస్తోంది. నాని పవర్ ఫుల్ పాత్రల్లో నటించినట్టు తెలుస్తోంది.
డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు టీం యూనిట్ ప్రకటించింది. టీజర్ చూస్తే ఏదో నిగూఢ కథ ఉందని తెలుస్తోంది. సినిమా వచ్చే వరకూ అదేంటనేది బయటపడేలా కనిపించడం లేదు.
నాని ‘శ్యామ్ సింగరాయ్’ ట్రైలర్ ఇదే..