సాధారణంగా సకల సంపదలకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాంటి సకలసంపదలు మనకు కలగాలని నిత్యం శ్రీ మహాలక్ష్మి దేవికి పూజలు చేస్తాము. ఈ విధంగా మహాలక్ష్మిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని ఎంతోమంది ప్రగాఢ నమ్మకం.లక్ష్మీ స్వరూపమైన డబ్బును అనవసర ఖర్చుల కోసం వృధా చేయటం వల్ల మహాలక్ష్మి ఆగ్రహానికి గురి కావాల్సిందేనని పండితులు చెబుతున్నారు. మన ప్రశాంతమైన మనసుతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా అమ్మవారిని పూజించటం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని భావించి, డబ్బులు వృధా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అందుకోసమే ధనాన్ని వృధా చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవితో పాటు, సంపదలకు స్వరూపుడైన ఆ కుబేరుని పూజించటం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పవచ్చు. సాధారణంగా కుబేరుడిని సంపదలకు నిలయమని భావిస్తారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు ఈ కుబేర మంత్రాన్ని చదవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ మంత్రాన్ని చదివేటప్పుడు మన మనసు ఎల్లప్పుడూ ఎలాంటి కల్మషం లేకుండా, ప్రశాంతంగా ఉండాలి.
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః అనే కుబేర ధన మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా కుబేర గాయత్రి మంత్రాన్ని 21 రోజులు చదవటంవల్లఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.