విశాఖలో సీఎం జగన్ కార్యాలయానికి 113 కోట్లా?

ఏపీలో మూడు రాజధానులకు రంగం సిద్ధం చేస్తున్న సీఎం జగన్ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సచివాలయం, సీఎం కార్యాలయానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే తాజాగా విశాఖలో సీఎం జగన్ కార్యాలయానికి బడ్జెట్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నట్టు అమరావతి సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తెలంగాణ సచివాలయ నిర్మాణానికే దాదాపు 400 నుంచి 500 కోట్లు కేసీఆర్ వెచ్చిస్తున్నారు. అంత పెద్ద భవనానికి ఆ మోత్తం ఓకే. కానీ […]

Written By: NARESH, Updated On : January 31, 2021 9:50 pm
Follow us on

ఏపీలో మూడు రాజధానులకు రంగం సిద్ధం చేస్తున్న సీఎం జగన్ ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సచివాలయం, సీఎం కార్యాలయానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే తాజాగా విశాఖలో సీఎం జగన్ కార్యాలయానికి బడ్జెట్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నట్టు అమరావతి సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

తెలంగాణ సచివాలయ నిర్మాణానికే దాదాపు 400 నుంచి 500 కోట్లు కేసీఆర్ వెచ్చిస్తున్నారు. అంత పెద్ద భవనానికి ఆ మోత్తం ఓకే. కానీ ఏపీలో సీఎం జగన్ కార్యాలయానికి ఏకంగా 113 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. ఇదినిజమా? లేక టీడీపీ పుట్టించిందా అన్నది తెలియదు కానీ.. ఏకంగా జగన్ కార్యాలయానికి అన్ని కోట్లు వెచ్చించడం ఏంటన్న ప్రశ్న విమర్శకుల నుంచి వ్యక్తం అవుతోంది.

సీఎం క్యాంప్ కార్యాలయానికి రూ.113 కోట్లతో విశాఖ ఉడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ప్రచారం సాగుతోంది. పనుల ప్రారంభానికి తక్షణమే రూ.16 కోట్లు ఇవ్వాలని అడగ్గా.. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణానికి ముమ్మర కసరత్తు చేస్తున్నట్టు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం కార్యాలయం బ్లూ ప్రింట్, డిజైన్లు సిద్ధం అయ్యాయని.. లేఔట్ ప్లాన్ కు కూడా ఆమోదం లభించిందని సమాచారం. ఈ క్రమంలోనే ఏకంగా 113 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించడం అమరావతివర్గాల్లో చర్చనీయాంశమైంది.