బడ్జెట్ స్పెషల్: ఇంకెన్నాళ్లు ఈ దుర్భర భారతం..?

కరోనా కల్లోలంతో దేశం ఆగమైంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు మైనస్ 28కు పడిపోయింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. కానీ అది గాలిబుడగలా ఎటు పోయిందో అర్థం కాలేదు. ఇప్పటికీ కరోనాతో ప్రజల ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రబడ్జెట్ పై దేశ ప్రజల్లో బోలెడు ఆశలున్నాయి. వాటిని మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందా? ఈరోజు బడ్జెట్ లో ప్రజలపై […]

Written By: NARESH, Updated On : February 1, 2021 9:22 am
Follow us on

కరోనా కల్లోలంతో దేశం ఆగమైంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు మైనస్ 28కు పడిపోయింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. కానీ అది గాలిబుడగలా ఎటు పోయిందో అర్థం కాలేదు. ఇప్పటికీ కరోనాతో ప్రజల ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రబడ్జెట్ పై దేశ ప్రజల్లో బోలెడు ఆశలున్నాయి. వాటిని మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందా? ఈరోజు బడ్జెట్ లో ప్రజలపై వరాల వాన కురిపిస్తుందా? మోడీ సర్కార్ బడ్జెట్ లో ఏం చెప్పనుందనేది ఉత్కంఠగా మారింది..

భారతదేశం ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశం. ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుంటూ ముందుకు సాగుతున్న దేశం. ప్రపంచంలో ఎలాంటి విపత్తులు వచ్చినా భారత్ లో తట్టుకోవడం కష్టం. ఎందుకంటే అధిక జనాభా కలిగిన దేశమైనా ఆర్థిక ప్రమాణాలు తక్కువగా ఉన్న ప్రాంతం. ప్రపంచాన్ని వణికించిన కరోనా భారత్ నూ విడిచిపెట్టలేదు. కరోనా వచ్చినా ఇక్కడి వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లతో తట్టుకోవచ్చని కొందరు ఎవరికిష్టమొచ్చినట్లు వారు ప్రచారం చేశారు. కానీ కరోనా వారి ప్రచారాన్ని పటపంచాలు చేసింది. ఎలాగోలా భారత్ లోకి ప్రవేశించింది. దాదాపు లక్షన్నరకు పైగా మంది ప్రాణాలకు బలిగొంది.

కరోనా సంగతి పక్కనబెడితే ఈ సమస్యతో భారత్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఎక్కువగా పేదలు నివసించే ఇండియాలో రోజూ చేతులు ఆడనిదే కడుపులోకి తిండి వెళ్లని పరిస్థితి. అలాంటి పేదలున్న భారత్ లో లాక్ డౌన్ పీరియడ్ లో నరకం అనుభవించారు. కొందరు ఆకలికి తట్టుకోలేక మరణించారు కూడా. ఈ పరిస్థితి చూసే ప్రభుత్వం ఎక్కువ రోజు లాక్ డౌడ్ ఉంచకుండా అన్ లాక్ ప్రకటించేసింది. అయితే పేదల సంగతి ఇలా ఉంటే ధనవంతుల సంగతి మరోలా ఉంది. కరోనా లాక్ డౌన్ ఉన్నా వారి ఆదాయం అంతకంతకు పెరిగింది. ఇటీవల ప్రకటించిన కుబేరుల ఆదాయాల్లో ముఖేష్ అంబానీ ఆదాయం గంటల్లో కోట్ల రూపాయలు ఉంది. ఏ పరిస్థితి ఎలా ఉన్నా వారి ఆదాయానికి మాత్రం ఢోకా లేదు.

కరోనా కాలంలో కొందరి ఆదాయం పూర్తిగా తగ్గితే ముఖేష్ అంబానీ లాంటి వారి ఆదాయం అంతకంతకు పెరగడం ఆశ్చర్యకరం. అయితే వారి ఆదాయాన్ని పెంచింది మళ్లీ సామన్య ప్రజలే. జియో టెలికం, పెట్రోల్ రంగం ద్వారా అంబానీ ఫ్యామిలికీ సగటు సామాన్యుడు ఎంతో కొంత చెల్లించాడు. ఈ సమయంలో ఆ పేదలకు అంబానీ ఏమైనా సాయం చేశాడా..? అంటే ఎక్కడా కనిపించదు. పైపెచ్చు ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టడంతో పాటు సామాన్య ప్రజలకు అందే సంక్షేమ పథకాల్లోనూ సగం సగం చేసింది.

కానీ ముఖేష్ అంబానీ లాంటి వాళ్లు ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తున్నట్లు ప్రకటించినా అవి ఎవరి ప్రయోజనాల కోసమో అర్థం కాదు. సోనూసుద్ లాంటి వారు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎంతో మందికి సాయం చేశారు. అలాంటి సాయం ముఖేష్ అంబానీ లాంటి ఫ్యామిలీ చేసిందా..? లేదు..! ఎందుకంటే వారి దృష్టంతా ఆదాయాన్ని పెంచుకోవడమే తప్ప.. పంచడం కాదు.

గతంలో కేంద్ర ప్రభుత్వం కరోనా నుంచి బయటపడిందని, ఆదాయం స్థిరంగా మారిందని ప్రకటించింది. ఇందుకు కారణం సామన్యులు అందించిన సహకారమే అని ప్రభుత్వం గుర్తించినట్లు కనిపించలేదు. ప్రభుత్వ సాయం ప్రకటించిన అవి సగటు పేదవారికి చేరాయా..? లేదా..? అనేది తెలియదు. కానీ వారు దైనందిన విధులు నిర్వహించకపోతే డొక్క నిండదని తెలుసు. అందుకే వారి పనిని వారు చేసుకుంటూ ఖర్చు చేశారు. దీంతో వారి ఆదాయంతో పాటు ప్రభుత్వం ఆదాయం మెరుగుపడింది.

కానీ ప్రభుత్వం మాత్రం రేషన్ బియ్యాన్ని పెంచుతూ.. ఎవరికీ అందని ఉద్దీపన పథకాలు ప్రకటించింది. రేషన్ బియ్యాన్ని దాదాపు పేదలే ఈరోజుల్లో తినడం లేదని కొన్నిసర్వేలు చెబుతున్నాయి. ఇంకా తాము పేదలను ఆదుకున్నామని రేషన్ బియ్యం పథకాన్ని చూడడం ఎంతమాత్రం సమంజసం కాదు. ప్రతీ సామాన్యుడు తినే ఆహారంతో ప్రభుత్వం అందించగలిగే శక్తి ఉంది. అందుకు ప్రైవేట్ శక్తుల సహకారం తీసుకునే అవసరమూ ఉంది. కానీ వాటిని పట్టించుకోదు. అటు ప్రైవేట్ వ్యవస్థలు సైతం విరాళాలు ప్రకటించడం తప్ప సగటు పేదవారికి ఎలా సాయం చేయాలన్నది మాత్రం ఆలోచించరు.

ఇప్పటికైనా పేదవారికి అత్యవసరమైన వైద్యం, విద్య, రక్షిత నీటిని అందించే కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఈ బడ్జెట్ లో వాటికే ప్రాధాన్యతనిచ్చి ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చాలని ప్రజలు, మేధావుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇంకా పాత పథకాలనే కొనసాగిస్తూ పాత పాడడం కరెక్టు కాదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అటు ప్రైవేట్ శక్తులు వ్యవస్థలను ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో పేదవారికి సాయం విషయాన్ని సైతం ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు.