Miss India 2022 Sini Shetty: మిస్ ఇండియా పోటీల్లో మొత్తానికి కొత్తందం మెరిసింది. కర్ణాటకకు చెందిన శిని శెట్టి అందాల విజేతగా ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుని దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది. అసలు శిని శెట్టి అన్నం తింటుందా ? లేక అందం తింటుందా!. ముంబైలోని రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్ లోని ప్రేక్షకులు, ఆమెను చూసి అచ్చం ఇలాగే ఫీల్ అయ్యారు. 58వ ఫెమినా అందాల పోటీల్లో 21 సంవత్సరాల శిని శెట్టి తన అందంతో కట్టి పడేసింది.

శిని శెట్టి నవ్వితే వెన్నెల కురవాల్సిందే. అజంతా శిల్పానికి కూడా శిని శెట్టికున్న కొలతలు ఉండవేమో. అంత అందంగా ఉంటుంది ఆమె. చక్కటి ఎత్తు, చూస్తూ ఉండిపోవాలనిపించే రూపం, అందులోనూ తెలివైన అమ్మాయి.. క్లుప్తంగా చెప్పుకుంటే శిని శెట్టి బయోడేటా ఇది. అందుకే, మిస్ ఇండియా 2022 కిరీటం ఏరికోరి శిని శెట్టిను వరించింది.
Also Read: Venkatesh Wife: వెంకటేష్ తన భార్య ని మీడియా కి చూపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
కానీ.. మిస్ ఇండియా 2022గా శిని శెట్టి ఎంపికైంది అనగానే.. అందరూ షాక్ అయ్యారు. 21 ఏళ్ల అమ్మాయి, ఇంకా చదువు కూడా పూర్తి కానీ అమ్మాయి.. ఇంత అలవోకగా ఆ అందాల కిరీటాన్ని ఎలా అందుకుంది ? అంటూ ఆశ్చర్యచకితులు అయిపోతున్నారు. అంతేనా.. అందాల కిరీటం తన తలపై ధరించి ఎన్నో సేవా కార్యక్రమాలకు శిని శెట్టి ప్రతినిధిగా మారబోతోంది. పైగా మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా నుంచి వెళ్లబోయే ఏకైక అందగత్తె కూడా శిని శెట్టినే కావడం విశేషం.

ఇంతకీ అసలు ఈ శిని శెట్టి ఎవరు ? ఇన్నాళ్లు ఎక్కడ ఉంది ? శిని శెట్టి తల్లిదండ్రలది కర్ణాటక. ఐతే, శిని శెట్టి తండ్రిగారు ఉద్యోగ రీత్యా వారు ముంబైలో స్థిరపడ్డారు. దీంతో శిని శెట్టి అక్కడే పుట్టి పెరిగింది. చిన్నప్పట్నించి శిని శెట్టికి శాస్త్రీయ నాట్యం అంటే ప్రాణం. ఎంతో కష్టపడి భరతనాట్యంకూడా నేర్చుకుంది.
పద్నాలుగేళ్లకు అరంగేట్రం కూడా చేసింది. ఈ టాలెంట్ తోనే శిని శెట్టి మిస్ ఇండియా పోటీల్లో మిస్ టాలెంట్ అవార్డును అందుకోగలిగింది. శిని శెట్టి అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్టు కోర్సు చేస్తోంది.
Also Read: Dethadi Harika: దేత్తడి హారిక హాట్ షో.. అసలు అది డ్రెస్సేనా.. మరీ అంతగా
Recommended Videos
